ఆరేళ్ల బాలికని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసి ప్రైవేట్ భాగాలను కోసేసిన ఓ దుర్మార్గుడు..!
అయితే కనిపించకుండాపోయిన బాలిక కోసం కుటుంబ సభ్యులు గ్రామస్తులు వెతకడం ప్రారంభించారు. కానీ బాలిక ఆచూకీ లభ్యం కాకపోవడంతో కొత్వాలి పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి తమ బాలికని ఎవరో అపహరించారని ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం వెదకడం ప్రారంభించారు. చాలా గంటల పాటు వెతికిన పోలీసులకు ఆగస్టు 7వ తేదీన ఉదయం ఒక పొలంలో బాలిక అపస్మారక స్థితిలో కనిపించగా... కుటుంబీకులకు, తల్లిదండ్రులకు బాలిక ఆచూకీ లభ్యం అయ్యిందని సమాచారం అందించారు పోలీసులు.
కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని రక్తపుమడుగులో అపస్మారక స్థితిలో ఉన్న తమకుమార్తె ను చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆపై హపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలికకు బాగా గాయాలు కావడంతో శస్త్రచికిత్సలు అవసరం కాబట్టి ఆమెను మీరట్ లోని మెడికల్ కాలేజీకి తరలించారు పోలీసులు. ఐతే మీరట్ ఆసుపత్రి వైద్యులు ఆరేళ్ల బాలికని పరిశీలించి బాలికపై అత్యాచారం జరిగిందని... ప్రైవేట్ భాగాలు బాగా దెబ్బతిన్నాయని వెల్లడించారు.
మరోవైపు నిందితుడు పొలంలో ఎక్కడైనా దొరుకుతాడేమోనని ఐదారు గంటల పాటు గ్రామస్తులు వెతికారు కానీ అతని ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు కూడా 8 బృందాలుగా ఏర్పడి గత 36 గంటలు గా నిందితుడి కోసం గాలిస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఘటనపై హాపూర్ పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ సుమన్ మాట్లాడుతూ... 'బాలికపై అత్యాచారం జరగడం దురదృష్టకరం. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బాలిక ప్రస్తుతం మీరట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది', అని చెప్పారు.