కరోనాపై పోరులో జగన్ సర్కార్ మరో ముందడుగు...?
ప్రతి పది లక్షల మందిలో 43,059 మందికి కరోనా పరీక్షలు చేస్తునామని చెప్పారు. రాష్ట్రంలోని నెల్లూరు, పశ్చిమగోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలు, కడప, కృష్ణా జిల్లాల్లో రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ కరోనా నివారణ చర్యల గురించి సమీక్ష నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ అధికారులకు రాష్ట్రంలో ఉన్న 139 ఆస్పత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాలలో భోజనం, పారిశుధ్యం, మౌలిక సదుపాయల గురించి ఆరా తీయాలని చెప్పారు.
టెలీమెడిసిన్ ద్వారా మందులు పొందిన వారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి సేవల గురించి ఆరా తీయాలని చెప్పారు. 104, 14410 కాల్ సెంటర్ నెంబర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచనలు చేశారు. ఏవైనా లోపాలను గుర్తిస్తే వాటిని వెంటనే సరిదిద్దుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. అత్యవసర మందులను అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.
కరోనా ఆస్పత్రుల్లోని సేవలపై కూడా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న ఆస్పత్రులు, ఇతర వివరాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఏఎన్‌ఎం కరోనా వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలన్న సమాచారం ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. పెద్ద హోర్డింగ్స్, పోస్టర్లతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర కరోనా సోకితే ఏం చేయాలి.? ఎవరిని సంప్రదించాలి.? అనే అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.