శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేటినుండే ప్రారంభం..?
అయితే నిత్యం హోమాలు కళ్యాణోత్సవాలు... వ్రతాలు జరుగుతూనే ఉంటాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో అలాంటి వాటికి ఎక్కడ అనుమతించలేదు టిటిడి బోర్డు. ఈ క్రమంలోనే భక్తుల డిమాండ్ దృశ్య కొన్ని సడలింపులు ఇచ్చింది... భక్తులకు శ్రీవారి దర్శనానికి వచ్చేందుకు కూడా అనుమతులు కల్పిస్తోంది, ఇక తాజాగా శ్రీవారి భక్తులకు టిటిడి బోర్డు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే పరిమిత సంఖ్యలో కొంత మంది భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించేందుకు నిర్ణయించిన టీటీడీ బోర్డు... ఇక ఇప్పుడు కల్యాణోత్సవం ఆన్లైన్ సేవ కూడా ప్రారంభించింది.
అయితే ఆన్లైన్ కల్యాణోత్సవ సేవ టిటిడి బోర్డు ప్రారంభించిన నేపథ్యంలో భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఎంతో మంది జంటలు శ్రీవారి కల్యాణోత్సవం సేవలో పాల్గొనేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.. ఈరోజు శ్రీవారి కళ్యాణోత్సవ సేవలో ఏకంగా 100 కు పైగా జంటలు పాల్గొని పూజ కార్యక్రమాలు నిర్వహించాయి. రేపటి కళ్యాణోత్సవ సేవకు ఇప్పటికే 500 మందికి పైగా భక్తులకు టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని... టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీవారి కల్యాణోత్సవం ఆన్లైన్ సేవకు టిటిడి బోర్డు అనుమతించడం భక్తులకు ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి.