అయోధ్య భూమి పూజ.. పాకిస్థాన్ క్రికెటర్ ఏమన్నాడో తెలుసా..?

praveen
భారత ప్రజలందరూ దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నా మహత్తర ఘట్టం నిన్న జరిగిన విషయం తెలిసిందే. పరిమిత సంఖ్యలో అతిథులు భక్తుల మధ్య శ్రీ రామజన్మ భూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ దృశ్య  భూమిపూజ కార్యక్రమానికి హాజరు కాలేని భక్తులందరూ... టీవీ వేదికగా ఈ భూమి పూజ కార్యక్రమాన్ని తిలకించి పులకించి పోయారు. టీవీలో చూస్తున్న అందరికీ ఈ కార్యక్రమం కన్నుల పండుగగా కనిపించింది. అయోధ్య భూభాగం కోసం పోరాడిన  ఎంతోమంది రామాలయ నిర్మాణానికి భూమిపూజ కావడంతో భావోద్వేగానికి గురైన విషయం కూడా తెలిసిందే.




 అయితే తాజాగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ పై  పాకిస్తాన్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ నేపథ్యంలో నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్... రామాలయ  భూమి పూజ కార్యక్రమం పై స్పందిస్తూ... సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన పాక్ క్రికెటర్ డానిష్ కనేరియా... అందరికీ ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. కుల మత భేదం లేకుండా సోదర భావంతో ఎలా మెలగాలి అనే విషయాన్ని శ్రీ రాముడి జీవితం చూసి నేర్చుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు.



 రాముడి అందం మొత్తం ఆయన పేరు లో కాకుండా ఆయన వ్యక్తిత్వం లో  దాగి ఉంది అంటూ వ్యాఖ్యానించారు... చెడు పై మంచి ఎప్పటికీ గెలుస్తుంది అనే దానికి రాముడు ఒక  సూచిక అంటూ వ్యాఖ్యానించారు. అయోధ్య లో  భూమిపూజ జరగడంతో ప్రపంచవ్యాప్తంగా హిందువులందరి  మనసు పులకించి పోయింది అంటూ తెలిపారు. ఇదిలా ఉంటే  ప్రస్తుతం నిషేధానికి గురైన కనేరియా..  తాను హిందువుని అయినందువల్ల పాక్ క్రికెట్ బోర్డు తన పై నిషేధం విధించింది అంటూ గతంలో పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.కాగా  పాకిస్తాన్ క్రికెటర్ అయ్యుండి అయోధ్య రామాలయం భూమి పూజ కార్యక్రమం పై స్పందిస్తూ గొప్పగా మాట్లాడటం... అందరికీ మరింత సంతోషాన్ని కలిగించింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: