సాంబారులో సగం బల్లి.. మిగతా సగం అతని..?

praveen
మామూలుగా రెస్టారెంట్లలో ఎవరైనా భోజనం చేసేటప్పుడు సాంబారులో బల్లి పడడం... లాంటివి మనం సినిమాల్లో బాగా చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో మాత్రం అలాంటివి చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు జరిగిన ఘటనలు మాత్రం వైరల్ గా మారిపోతూ ఉంటాయి, కొంతమందికి సినిమాల్లో లాంటి ఘటనలే నిజజీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. మంచి పేరున్న  హోటల్ అది. రుచి కూడా అబ్బో అద్భుతంగా ఉంటుంది... నాణ్యత కూడా బాగుంటుంది... కానీ ఇటీవల జరిగిన ఒక సంఘటన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.



 ఏకంగా సాంబారులో బల్లి రావడం అక్కడికి వచ్చే కస్టమర్లు అందరికీ గుబులు పుట్టించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ షాపింగ్ కాంప్లెక్స్ లో... హోటల్లో దోస సాంబార్ తింటున్నాడు ఒక వ్యక్తి. ఇక దోషను  సాంబార్లో నంచుకుని తింటు  ఉన్న సమయంలో చేతికి ఏదో గట్టిగా తగిలింది, ఏంటి అని తీసి చూశాడు... ఏముంది కడుపు లోకి వెళ్ళింది మొత్తం.., బయటకు వచ్చేందుకు సిద్ధమైంది. ఎందుకంటే సాంబార్ లో పడింది బల్లి.  సాంబారులో బల్లి పడడం ఒక ఎత్తయితే కేవలం ఆ సాంబార్ లో సగం బల్లి మాత్రమే ఉండటం మరో  చర్చకు దారి తీసింది. హోటల్ యాజమాన్యం ని పిలిచి అక్కడ జరిగిన ఘటనను చూపించాడు.


అయితే సాంబార్ లో సగం బల్లి మాత్రమే ఉందని మిగతా సగాన్ని తానే  తినేసానా  అన్న అనుమానం కూడా అతడిలో కలిగింది. ఎందుకంటే సగం బల్లిని తినేసి ఉంటే  ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయంపై అటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు ఆ బాధితుడు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: