చెత్త వేసేందుకు వెళ్లిన బాలిక.. అలా జరుగుతుందని ఊహించలేకపోయింది.. చివరికి..?

praveen
ఆడపిల్లను కన్న ప్రతి తండ్రి ప్రస్తుతం... క్షణ క్షణం భయంతో బతకాల్సి వస్తోంది. ఎందుకంటే కామంతో కళ్ళు మూసుకుపోయిన ఈ సమాజంలో.. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి తల్లి ఎక్కడ కామాంధుల బారినపడి  బలై పోతుందో అన్న భయం.   మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన దుర్మార్గులను... శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. చివరికి ఉరితీసినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి ఆడపిల్ల కనిపిస్తేచాలు మృగాళ్ల  మారిపోతున్నారు.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మీద పడి అత్యాచారాలకు పాల్పడుతున్నారు.



అభం శుభం తెలియని చిన్నారులను సైతం... కామాంధులు  చిదిమేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ముజఫర్ నగర్  పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక చెత్త పడేసేందుకు ఇంట్లోంచి డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్ళింది. ఒంటరిగా వెళ్లిన ఆ బాలిక కామాంధుల నుంచి తనకు రక్షణ లేదు అని గ్రహించలేకపోయింది. ఇక ఒంటరిగా వెళ్లిన బాలిక పై కన్నేసిన కామాంధులు అమాంతం ఆ బాలికను పక్కనే ఉన్న చెరుకు తోట లోకి ఎత్తుకెళ్లారు. అక్కడ తోటలో కింద పడేసి పశువుల్లా  మీద పడి కామవాంఛ తీర్చుకున్నారు. ఆ బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.


 అక్కడితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియో  తీసి పైశాచిక ఆనందాన్ని కూడా పొందారు మనుషుల  ముసుగులో ఉన్న రాక్షసులు . ఇక ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు కాసేపటికి తేరుకున్న బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... పోక్సో చట్టంలోని  పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకొని నిందితుడు గౌరవ్ ని  అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: