టిక్ టాక్ బేరసారాలు.. ఈ దెబ్బతో మళ్ళీ ఇండియాలోకి.. ఇక యూజర్స్ కి పండగే..?
దీనికి సంబంధించిన బిల్లు కూడా అమెరికాలోని ఉభయ సభల్లో కూడా ఆమోదం పొందింది.. ఇంకొన్ని రోజుల్లో టిక్ టాక్ నిషేధానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటికే భారత్ లో ఉన్న కస్టమర్లను కోల్పోయి 40 శాతం వరకు నష్టపోయింది టిక్ టాక్. ఒకవేళ అమెరికాలో కూడా నిషేదానికి గురయితే 70 శాతం వరకు నష్టాల పాలు అయ్యే అవకాశం ఉంది. దీంతో టిక్ టాక్ ను నిర్వహించడం కూడా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక బేరసారాలకు దిగుతుంది ప్రస్తుతం టిక్ టాక్. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ టిక్ టాక్ మాతృసంస్థ అయిన బైక్ డాన్స్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే టిక్ టాక్ ను మైక్రోసాఫ్ట్ కి అమ్మెందుకు ప్రస్తుతం ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అటు ఇండియాలో కూడా జియో టిక్ టాక్ ని కొనేందుకు సిద్ధంగా ఉంది అంటూ టాక్ వినిపిస్తోంది. లేదా గూగుల్ టిక్ టాక్ కొనే ఆలోచనలో ఉందట . అయితే ఒకవేళ చైనా కు సంబంధించిన బైట్ డాన్స్ చేతిలోంచి.. మిగతా కంపెనీల చేతిలోకి టిక్ టాక్ వెళ్తే... నిషేధానికి గురైన టిక్ టాక్ ప్రస్తుతం మళ్లీ భారత్ లోకి వచ్చేందుకు అవకాశం కూడా లేకపోలేదు. ఇది టిక్ టాక్ యూసర్స్ కి శుభవార్తే అని చెప్పాలి.
Powered by Froala Editor