తిరుపతిలో కష్టాలు పడుతున్న రష్యన్ యువతి.. !

Suma Kallamadi

రష్యా నుంచి ఎస్తర్ అనే ఒక యువతి తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చింది. అయితే ఆమె ఇప్పుడు చిక్కుకుపోయి తిరుపతి లో కష్టాలు పడుతోంది. అయితే శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఆమె వచ్చి ఇక్కడ నానా కష్టాలు పడుతోంది. తెచ్చుకున్న నగదు ఖర్చు అయిపోయి సహాయం కోసం ఎదురు చూస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆమెకు నగదు సహాయం చేశారు. అంతే కాకుండా ఆమెకు రష్యాకు వెళ్లడానికి సహాయం చేస్తానని కూడా చెప్పారు. 

 

ఈ ఏడాది ఫిబ్రవరి 6న తన తల్లి తో కలిసి భారతదేశంకి వచ్చింది. ఈమె టూరిస్ట్ వీసాపై వచ్చి మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లో వివిధ ప్రదేశాలు చూసింది. ఈలోగా కరోనా ప్రభావం తీవ్రంగా మారిపోయింది. లాక్ డౌన్ తో విదేశీ విమానాలు కూడా రద్దు చేయడం జరిగింది. అయితే తిరిగి వెళ్లడానికి  మార్గం లేక ఇక్కడే ఉండిపోయారు. ఈ నెల 19న తిరుపతి వచ్చారు. అయితే కోవిడ్ కారణంగా విదేశీ భక్తులుకి తిరుపతి దర్శనానికి అనుమతి లేకపోవడంతో నిరాశపడ్డారు అయితే ఇలా జరుగుతుండగా తెచ్చుకున్న డబ్బు అయిపోయింది.

 

తల్లి ఉత్తరప్రదేశ్లో, కూతురు తిరుపతిలో ఉండిపోయారు. డబ్బు లేకపోవడంతో హోటల్ గది ఖాళీ చేసి వచ్చేసారు.ఆశ్రయం కోసం ప్రయత్నించింది యాత్రికుల వసతి పై ఆంక్షలు విధించడంతో  ఇస్కాన్ లో ఉండే రామ్ దాస్ తనకి భోజన సదుపాయం కలిపిస్తానని వసతి చూసుకోమని చెప్పారు. డబ్బులేక అలిపిరి రోడ్ ‌లో తిరుగుతున్న ఎస్తర్‌ పరిస్థితి గమనించి కపిల తీర్థం వద్ద ఒక రెసిడెన్సీ లో వసతి కల్పించారు. ఆమెకి ఎవరైనా సాయం చేస్తే తిరిగి తన దేశం వెళ్లిపోతానని చెప్పారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి  తన కోటాలో శ్రీవారి దర్శనం కల్పిస్తామని ఆమెకి చెప్పారు. తన సొంత నిధులతో రష్యాకు పంపడానికి సహాయం చేస్తానని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: