సోను సూద్ ని కూడా మోసం చేసారా.. జగన్ పార్టీ ఇదేం రాజకీయం..!?

praveen

గత కొన్ని రోజుల నుంచి నిరుపేదలకు సహాయం చేస్తూ పెద్దమనసు  చాటుకుంటున్నారు సినీనటుడు సోనుసూద్. వలస కార్మికులు తమ స్వగ్రామాలకు చేర్చేందుకు ఎంతగానో కృషి చేశారు. ఇలా వరుసగా ఎంతోమంది నిరుపేదలకు సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు  కూతుళ్లు కాడెద్దులు గా మారి వ్యవసాయం చేయడం పై చలించిపోయిన సోనుసూద్... వ్యవసాయం చేసుకోవడానికి ట్రాక్టర్ కొనిచ్చిన  విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన కాస్తా మొత్తం దేశవ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది. ఒక రైతు కుటుంబానికి ట్రాక్టర్ ఇప్పించడం ఎంతో సంచలనంగా మారగా  సోను సూద్ పై  ప్రశంసలు కురిసాయి.

 ఈ క్రమంలోనే ఏపీ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సోను సహాయానికి  ఎంతో హర్షం వ్యక్తం చేశారు. రైతు కుటుంబానికి సోను సూద్  చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఎలా చంద్రబాబు నాయుడు సోను సూద్ చేసిన పనికి కృతజ్ఞతలు తెలపడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ రైతు పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. నాగేశ్వరావు  ఏమి పేదవాడు కాదని గతంలో లోక్ సత్తా  పార్టీలో పోటీ చేశారు అంటూ కొంతమంది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


 ఆ రైతు యొక్క నిజ పరిస్థితి తెలిసి సహాయం చేసి ఉంటే బాగుండేది అని కొంతమంది అంటున్నారు, అంతేకాకుండా నాగేశ్వరరావు తరచు వ్యవసాయం చేసే వాడు కాదని ప్రస్తుతం లాక్ డౌన్  ఉండడంతో... ఏదో వీడియోల కోసం అలా తన కూతుళ్లను కాడెద్దులుగా నిలబడి దున్నుతున్నట్లుగా చేసాడు  అంటూ  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించడం మొదలుపెట్టారు. అయితే దీనిపై స్పందించిన రైతు తన పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలంటే మహాల్రాజ  పురానికి రావాలి అంటూ పిలుపునిచ్చారు. ఇక చంద్రబాబు తమ కూతుళ్లను చదివిస్తానని చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బురదజల్లుతున్నారు  అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతు . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీరుపై అటు రాజకీయ విశ్లేషకులు సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: