భారత వినాశనానికి చైనా కొత్త వైరస్.. కానీ బలవుతున్నది పాకిస్థాన్ ప్రజలు..?

praveen

ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం కరోనా  వైరస్ కబలిస్తుంది. చైనాలో  వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం అక్కడ తగ్గినప్పటికీ ప్రపంచ దేశాలను   మాత్రం అతలాకుతలం చేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో  చైనాపై ఎన్నో విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. చైనా ఉద్దేశపూర్వకంగానే కరోనా  వైరస్ ను ల్యాబ్ లో తయారు చేసి ప్రపంచ దేశాల వినాశనానికి ప్రయత్నించింది అంటూ వాదనలు వినిపించాయి. ఇంకా విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి కరోనా  వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తు ఎంతో మందిని బలి తీసుకుంటుంది. 

 


 ఇదిలా ఉంటే.. చైనా సరికొత్త వైరస్ ను  భారతదేశం పై దాడి చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒక నీచమైన ప్లాన్ వేసిన చైనా.. మిత్ర దేశమైన పాకిస్తాన్ లో  సరికొత్త వైరస్ వ్యాప్తి చెందేలా చేసి అక్కడినుంచి ఉగ్రవాదులను భారతదేశంలో కి పంపి  భారతదేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది అనేది ప్రస్తుతం వినిపిస్తున్న వాదన. ఆంత్రాక్స్ లైక్ అనే వైరస్ ఉగ్రవాదులకు వ్యాపించేలా చేసి వారిని భారత్ పైకి వదిలి భారత్ లో  కూడా ఈ వైరస్ వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తుందట. 


 కేవలం ఉగ్రవాదులకు మాత్రమే ఈ వైరస్ సోకితే అందరికీ అనుమానాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాకిస్థాన్ లోని  నిరుపేదలకు కూడా ఈ మహమ్మారి వైరస్ అంటిస్తూ ఎంతోమంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నదట చైనా. రోగాలను  సృష్టించి ఇండియా పై బయో  యుద్ధం చేయడానికి సిద్ధమవుతోంది చైనా. అయితే ఇలాంటి నీచమైన ప్లాన్  తమ దేశంలో అమలు చేసేందుకు పాకిస్తాన్ అనుమతించడం నిజంగా దారుణం అని అంటున్నారు విశ్లేషకులు. పాకిస్తాన్ లో  ప్రస్తుతం చనిపోతుంది కేవలం కరోనా  వల్లనే కాదు ఆంత్రాక్స్ లైక్ అనే వైరస్ వల్ల కూడా అన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: