కరోనా సోకిందనే అనుమానం ఉంటే చెయ్యాల్సిన, చేయకూడని పనులు ఇవే....?

Reddy P Rajasekhar

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. వైరస్ వ్యాప్తి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరోనా ధాటికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు వైరస్ ను నియంత్రించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
అయితే చాలామంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ భారీన పడుతున్నామని చెబుతున్నారు. వైరస్ గురించి పరిశోధనలు జరుగుతూ ఉండటంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ సోకకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అయితే కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే చెయ్యాల్సిన, చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి. ప్రతిరోజూ గంటకు ఒకసారైనా శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలి. 
 
రోజులో వీలైనంత వరకు నోరు, ముక్కు, కళ్లు, చెవులకు తాకకూడదు. కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే కాల్ సెంటర్లకు ఫోన్ చేసి శాంపిల్స్ తీసుకోమని కోరాలి. ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే మాత్రం వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని పరీక్ష చేయించుకోవాలి. పరీక్ష ఫలితాలు వచ్చేంత వరకు కుటుంబ సభ్యులకు విడిగా ఉండటం మంచిది. కరోనా వైరస్ 9 నుంచి 12 గంటలు జీవిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. 
 
లక్షణాలు కనిపిస్తే మనం రోజూ ముట్టుకుటున్న ప్రదేశాలను శానిటైజ్ చేయడం మంచిది. కరోనా సోకినా అనవసరంగా భయాందోళనకు గురి కాకూడదు. మన వల్ల ఇతరులకు వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి. మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటే వైరస్ భారీన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. వైరస్ సోకినా వైద్యుల సూచనలను పాటిస్తూ చికిత్స చేయించుకుంటే త్వరగా కోలుకుని సాధారణ జీవనం గడపవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: