చంద్రబాబు అసలైన బలం పై దెబ్బకొట్టేందుకు జగన్ ప్లాన్.. అందుకే ఇవన్నీ..?

praveen

ఆంధ్ర ప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి చంద్రబాబుకు  వరుస షాకులు తగులుతున్న  విషయం తెలిసిందే. టిడిపి కలలో కూడా ఊహించని విధంగా వైస్సార్ సీపీ  పార్టీ ఏకంగా 151 సీట్లు మెజారిటీ సంపాదించడం... పార్లమెంట్ స్థానాల్లో కూడా సత్తా చాటడంతో టీడీపీ అధినేత చంద్రబాబు  కు భారీ షాక్ తగిలింది. ఇక ఆ తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా బయట పెడుతూ టిడిపిపై ప్రజలందరికీ నెగటివ్ ఇంప్రెషన్ వచ్చేలా చేస్తూ వచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం చంద్రబాబు ను మరోసారి గట్టిగా దెబ్బతీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

 


 తెలుగు దేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చినప్పటినుంచి... బీసీలను ఆకర్షిస్తూ బీసీలకు ఎక్కువ ప్రాముఖ్యతను  ఇస్తూ... బిసి ఓటింగ్  మొత్తం తమ వైపు ఉండే విధంగా వ్యూహాలను అమలు చేస్తూ ముందుకు సాగారు చంద్రబాబు నాయుడు.. టిడిపి విజయంలో బిసి ఓటింగ్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  లో కానీ..  ప్రస్తుత  ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో కానీ  టిడిపి ఎక్కువగా ఆధారపడేది బిసి ఓటింగ్ పైనే. ప్రతి ఎన్నికల్లో కూడా టీడీపీ కి భారీ  ఓటింగ్ బీసీ ఓటింగ్ మాత్రమే. అయితే ఇన్నిరోజుల వరకు చంద్రబాబుకు వెన్నుముక్కగా  ఉన్న బిసి ఓటింగ్ ను  దెబ్బతీసేందుకు ప్రస్తుతం జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

 అయితే ప్రస్తుతం కార్పొరేషన్ విషయంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం ఈ ప్లాన్ లో భాగమే అంటున్నారు విశ్లేషకులు. బిసి ఓటింగ్ మొత్తం తనవైపు తిప్పుకునేందుకు జగన్ సర్కార్ బిసి లకు  52 శాతం రిజర్వేషన్ కల్పించడం.. బీసీలకు  అధిక ప్రాధాన్యతనిస్తూ బీసీ ఓటింగ్ మొత్తం తమవైపు తిప్పుకునేందుకు జగన్  ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు . ఇలా జగన్ సర్కారు చేపట్టిన ప్రతి పనిలో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ బీసీలను ఆకర్షిస్తూ...ఇన్ని రోజుల  వరకు చంద్రబాబుకు వెన్నుముకలా  ఉన్న బీసీ ఓటింగ్  ను తమవైపు తిప్పుకునేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది రానున్న రోజుల్లో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: