దారుణం : వైద్యం అందించే ఆర్ఎంపీ గొంతు కోసారు..?

praveen

రోజురోజుకు మనుషులు కాస్త మృగాలుగా మారిపోతున్నారు.. సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి వెనకడుగు వేయడం లేదు... రోజురోజుకు దారుణంగా మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు చూస్తుంటే సభ్య సమాజం తీరు భవిష్యత్తులో ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక మనిషి ప్రాణాలు తీస్తే శిక్ష పడుతుంది అన్న భయం కూడా ఎవ్వరి  లో కనిపించడం లేదు.  దీంతో ఎంతో మంది ప్రాణాలు గాల్లో  కలిసిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి ఘటనలు చాలానే తెర మీదకు వస్తున్నాయి. 

 తాజాగా ఇలాంటి ఘటన జరిగింది ఇక్కడ, మహిళా ఆర్ఎంపీ దారుణ హత్యకు గురైన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉంటుందని గమనించిన దుండగులు... పథకం ప్రకారం అర్ధరాత్రి సమయంలో మహిళ ఆర్ఎంపీ ఇంట్లోకి చొరబడి.. దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. పులిచర్ల మండలం కొత్తపేట కు చెందిన ఆర్ఎంపీ వైద్యురాలు కృష్ణవేణిని  చంపాలని గుర్తుతెలియని దుండగులు పథకం వేశారు. ఈ క్రమంలోనే సరైన సమయం కోసం ఎదురు చూసారు, 


 ఇక కృష్ణవేణి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. ఎవరు చూడకుండా లోపలికి చొరబడ్డారు దుండగులు. ఇక చంపొద్దు అంటూ కృష్ణవేణి ఎంత వేడుకున్నప్పటికీ అతి దారుణంగా కత్తితో గొంతుకోసి హత్య చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావమైన  కృష్ణవేణి అక్కడికక్కడే కుప్పకూలిపోయి  రక్తపు మడుగులో ప్రాణాలు వదిలింది. తర్వాత ఉదయం ఇంటికి యథాతథంగా వచ్చిన పని మనిషి రక్తపు మడుగులో ఉన్న కృష్ణవేణి ని  చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది.  వెంటనే భయాందోళనకు గురైన పనిమనిషి స్థానికులకు పోలీసులకు సమాచారం అందించింది.ఇక  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పలు ఆధారాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణవేణి హత్య ఎందుకు జరిగి ఉంటుంది అన్న దానిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: