అదిరిపోయే ప్లాన్ వేసిన కేంద్రం.. కేవలం 5 మాత్రమే మిగిలి వున్నాయి..!

frame అదిరిపోయే ప్లాన్ వేసిన కేంద్రం.. కేవలం 5 మాత్రమే మిగిలి వున్నాయి..!

Suma Kallamadi

మోడీ మోడీనే... ప్లాన్ వేస్తే దానికి తిరుగుండదు! అసలు అతగాడికి ఎదురే ఉండదు. కరోనా కారణంగా దెబ్బ పడింది గానీ.. లేదంటే ఇండియా షేప్ వేరేలా ఉండేది. అసలు విషయానికి వస్తే.. భారత కేంద్ర ప్రభుత్వం గతంలోనే బ్యాంకుల విలీన ప్రక్రియకు స్టెప్ వేసింది. ఈ క్రమంలోనే మరిన్ని ప్రభుత్వ బ్యాంకులను మోదీ సర్కార్ ప్రైవేటీకరించాలని అనుకుంటోంది. అయితే ఈసారి ఆలోచించ తగినది ఏమంటే... బ్యాంకులను విలీనం చేయకుండా.. ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాలను విక్రయించాలని చూస్తోంది.

 

ఇలా జరిగితే.. దేశంలో కేవలం 5 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే చిట్ట చివరకు మిగిలిపోనున్నాయి. బ్యాంకింగ్ రంగానికి చెందిన విశ్లేకుల ప్రకారం.. బ్యాంకింగ్ వ్యవస్థను, మరింత మెరుగు పరిచేందుకు మోడీ ఈ సూపర్ ప్లాన్ వేసినట్లు అనలైజ్ చేస్తున్నారు. దీనితో భారత బ్యాంకింగ్ తిరుగులేని మకుటంలా మారక తప్పదని వారి అభిప్రాయం.

 

కేంద్ర ప్రభుత్వం మొట్ట మొదటిగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీ్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, వంటి బ్యాంకుల్లో వాటాలను విక్రయించనుంది. ఓ ప్రభుత్వ బ్యాంక్ అధికారి మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం, దేశంలో కేవలం 4 నుంచి 5 ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే ఉంచాలనే దిశగా అడుగులు వేస్తోందని, ఇది శుభ పరిణామమని తెలిపారు. 

 

దేశంలో ప్రస్తుతం 12 ప్రభుత్వ బ్యాంకులు వున్న సంగతి తెలిసినదే. అయితే కేంద్రం ఈ ఏడాది 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసే క్రమంలో.. 4 బ్యాంకులుగా మార్చింది. దేశాన్ని ఓ పటిష్టమైన ఎకనామిక్ వ్యవస్థ గా తీర్చి దిద్దే ఆలోచనతోనే కేంద్రం ఈ ఆలోచన చేసిందని పలువురు బిజినెస్ ఉద్ధండులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా 5 కన్నా ఎక్కువ బ్యాంకులు అవసరం లేదని సమర్ధించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: