
పోస్టాఫీస్ స్కీమ్ అదిరింది.. లక్ష రూపాయలకి 2 లక్షలు..!
డబ్బులు సేవ్ చేసి, అధిక మొత్తంలో డబ్బులు గడించాలని అనుకుంటున్నారా..! అయితే ఇది మీకోసమే. పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర (KVP) మీలాంటి వాళ్ళ కోసం ఓ స్కీమ్ ప్రవేశ పెట్టింది. తక్కువ పెట్టుబడి, పైగా రిస్కు లేనిది... ఆ పైన మనీ గ్యారంటీ కూడాను. మరెందుకు ఆలస్యం... ఆ వివరాలేంటో చూసేయండి. మామ్మూలుగా మనం మనీ సేఫ్ గా ఉండాలని, దానిద్వారా వడ్డీ గడించాలని అనుకుంటాం.
సాధారణంగా.. ఎవరైనా బ్యాంక్‌లో డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయలని అనుకుంటారు. ఇంకో ఆప్షన్ గా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టుబడి పెడుతూ వుంటారు. ఇపుడు ఇలాంటి వాటికి ధీటుగా పోస్టాఫీస్ ఓ మంచి స్కీమ్ ప్రవేశ పెట్టింది. దాని పేరే "కిసాన్ వికాస్ పత్ర." ఈ పథకంలో చేరితే రిస్క్ లేకుండా అధిక మొత్తంలో రాబడి పొందొచ్చును. కొంచెం పెట్టుబడితో అంతే మొత్తంలో అధిక వడ్డీని పొందే వీలుంది.
ఇక ఈ "కిసాన్ వికాస్ పత్ర" స్కీమ్ మెచ్యూరిటీ కాలం 124 నెలలు. ఈ 124 నెలలలో మీరు యెంత డబ్బైతే పెట్టుబడి పెడతారో... దానికి రెట్టింపు డబ్బు లభిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత మీ రెట్టింపు డబ్బును పోస్టాఫీస్ ద్వారా పొందొచ్చు. ఈ స్కీమ్ పేద, మధ్య తరగతుల వారికి ఆసరాగా ఉండగలదు. అయితే ఇది ఇదివరకు వున్న పథకమే అని గమనించగలరు.
ఇంతకు ముందు ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే.. 113 నెలల్లో డబ్బు రెట్టింపు అయ్యేది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసినదే. అందువలన KVP స్కీమ్ వడ్డీ రేటు కూడా తగ్గిందనే విషయం ఇక్కడ గమనించాలి. అందువలననే ఇప్పుడు 124 నెల్లో డబ్బులు రెట్టింపు అవుతోంది.
గమనిక: 18 ఏళ్లకు పైన వయసు కలిగినవారు మాత్రమే కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో చేరాలి. కనీసం రూ.1000 ఇన్వెస్ట్ చేయాలి. నామినీ సదుపాయం కలదు. ఒకరి పేరుపై నుండి, మరొకరి పేరుపైకి ఈ పత్రాలను మార్చుకొనే వీలుంది.