తమ్ముడికి కరోనా పాజిటీవ్.. తనకు వస్తుందన్న భయంతో అన్న ఆత్మహత్య!

Edari Rama Krishna

చైనాలోని పుహాన్ లో పుట్టుకున వచ్చిన కరోనా మహమ్మారి రోజు రోజకీ తన ప్రతాపాన్ని దారుణంగా చూపిస్తుంది. కరోనా వల్ల ఇప్పటి ప్రపంచంలో ఎన్నో మరణాలు సంభవించాయి.  ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది.   ఇక కరోనా వచ్చిందన్న బూచీతో ఎంతో మంది కేటగాళ్ళు అమాయకును దారుణంగా మోసం చేస్తున్నారు.  కరోనా తగ్గిస్తామని తమ వద్ద మంచి మందు ఉందని నమ్మించి మోసం చేస్తున్నారు. కరోనా లక్షణాలతో కొందరు, కరోనా భయంతో మరికొందరు ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. తాజాగా తన తమ్ముడికి కరోనా సోకిందన్న బాధతో భయంతో ఓ అన్న ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

కరోనా వచ్చి చనిపోవడం పక్కనబెడితే.. ఆ వైరస్ వచ్చిందన్న భయంతో సగం మంది నిరుత్సాహపడుతున్నారు.. ప్రాణ భయంతో తల్లడిల్లి పోతున్నారు. మరికొన్ని చోట్ల తమ వల్ల కుటుంబానికి ఏమీ కావొద్దని ఆత్మహత్యలకు పాల్పపడుతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాగా, కోలారులోని గాంధీనగర్ కాలనీకి చెందిన నాగరాజ్ (37) తాపీ కార్మికుడు. అతడి తమ్ముడికి కరోనా సోకినట్టు శనివారం నిర్ధారణ అయింది.  సమాచారం అందుకున్న వైద్యాధికారులు ఇంటికొచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు.

తమ్ముడికి కరోనా సోకిందని తెలిసినప్పటి నుంచి నాగరాజ్‌లో ఆందోళన మొదలైంది. తనకు కూడా వైరస్ సోకి ఉంటుందన్న భయంతో అదే రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఉదయం ఫ్యాన్‌కు వేలాడుతున్న నాగరాజ్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: