
కరోనా వచ్చినా కరుణ చూపని మానవ మృగాలు.. సొంత మనుషులే కిరాతకులయ్యారు.!
తరాలు మారినా, యుగాలు మారినా, మానవ మృగాళ్లు ఎంతమాత్రమూ మారడంలేదు. మహిళా రక్షణ కోసం ఎన్ని రకాల చట్టాలు వచ్చినా.. వారిపైన దాడులు ఆగడంలేదు. భయంకరమైన కరోనా లాంటి రోగాలెన్ని వచ్చినా, ఈ మనిషిలో యెంత మాత్రమూ మార్పు రాదు. అన్ని రకాల మనుషుల్ని ఈ కరోనా ఒక్క తాటి మీదకు తెచ్చింది. కానీ ఈ విషయం మనిషి రియలైజ్ కాలేడు.
మహిళల పట్ల రోజు రోజుకీ వివక్ష పెరుగుతోంది. నేడు మగాడికి సమానంగా, ఆ మాటకొస్తే అంతకంటే ఎక్కువగా మహిళ కష్టపడుతోంది.. వివిధ రంగాలలో రాణిస్తోంది. కానీ ఆమెపైన దాడులు మాత్రం ఆగడంలేదు. నడ మంత్రపు సిరితో మగాడు, మహిళలపైన పెత్తనం చెలాయిస్తున్నాడు. వరకట్నం అనే విషయంలో ఎన్ని చట్టాలొచ్చినా మనుషులలో మార్పు ఎంతమాత్రమూ రాలేదు. సరికదా చట్టం తెలిసిన పెద్ద మనుషులే వరకట్నం విషయంలో ఆడవాళ్లను వేదించుకు తింటున్నారు.
సరిగ్గా ఇలాంటి ఘటనే.. షాద్ నగర్ సమీపంలోని, ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని, దూసకల్ గ్రామంలో నిన్న ఆదివారం జరిగింది. ఓ ఇంటి కోడలు, అత్తవారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన, ఆ పరిసర ప్రాంతంలో పెను దుమారాన్నే సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి..
నందిగామ మండలంనకు చెందిన బొమ్మగల్ల రాములు యొక్క ఒక్కగానొక్క కూతురు కూతురు శ్రీజ. ఈమెకు 20 ఏళ్ళు. మంచి సంబంధం రావడంతో రాములు... క్రిందటి సంవత్సరం మే 17న, ఫరూఖ్‌నగర్ మండలంనకు చెందిన కల్లెపల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి, ఘనంగా పెళ్లి జరిపించారు. డౌరీ రూపంలో ఇవ్వాల్సిన కట్న కానుకలు భారీగానే సమర్పించుకున్నారు. కానీ ఆశ తీరని శ్రీజ అత్తింటివారు గత కొంత కాలంగా ఆమెను మానసికంగా, శారీరకంగా.. అదనపు కట్నం కోసం ఏపుకు తింటున్నారు. మామ్మూలుగానే సెన్సిటివ్ అయిన శ్రీజ, మనోనిబ్బరాన్ని కోల్పోయి తనువు చాలించింది.