జపాన్ సంచలన నిర్ణయం.. చైనాకు భారీ షాక్.. భారత్ కి మాత్రం పండగే..?
విస్తరణ వాదంతో ముందుకు వెళ్తున్న చైనా ప్రస్తుతం ప్రతి ఒక్క దేశంతో వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జపాన్ కి సంబంధించిన ఓ భూభాగాన్ని కూడా తమదే అంటూ జపాన్ తో కూడా వివాదానికి తెరలేపింది. జపాన్ మాత్రం చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతుంది . మరోసారి చైనా జపాన్ వైపు చూసేందుకే భయపడేంతలా వ్యూహాలు అమలు చేస్తుంది జపాన్. అయితే ప్రపంచంలోనే అతి శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు చైనా ప్రయత్నిస్తూ ఉంటే తాజాగా జపాన్ వేసిన ముందడుగు మాత్రం చైనా కు భారీ షాక్ ఇచ్చింది అని చెప్పాలి.
ప్రస్తుతం జపాన్ కు సంబంధించిన అన్ని కంపెనీలను చైనా నుండి వెనక్కి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది జపాన్ సర్కార్. జపాన్ కు సంబంధించినటువంటి కంపెనీలు మాత్రమే కాదు.. చైనాలో పెట్టుబడులు పెట్టిన జపాన్ దేశానికి చెందిన వారుకూడా వెంటనే పెట్టుబడులను ఉపసంహరించుకుని చైనా నుంచి వెనక్కి రావాలంటూ పిలుపునిచ్చింది. ఇలా వచ్చే వారికీ భారీ ఆఫర్ కూడా ప్రకటించింది జపాన్ ప్రభుత్వం. అలా వెనక్కి వచ్చిన వారికి జపాన్ బడ్జెట్ లో ఏకంగా 20 శాతం కేటాయించింది.
అయితే ప్రస్తుతం ఇలా చైనా నుండి వెంటనే వెనక్కి రావాలని జపాన్ పిలుపునివ్వడం ఏకంగా 87 కంపెనీలు ముందుకు వచ్చాయి.. ఈ నేపథ్యంలోనే ఇలా వచ్చిన కంపెనీలు చైనా మినహా ఆసియాలోని పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటూ తెలిపింది జపాన్. ఇలా ప్రభుత్వం పిలుపునివ్వగానే 87 కంపెనీలు వెనక్కి రాగా.. వారి కోసం ఐదువేల కోట్ల డాలర్లు నిధులు విడుదల చేసింది జపాన్. అయితే ప్రస్తుతం జపాన్ తీసుకున్న నిర్ణయం భారత్ కి కలిసొచ్చే అవకాశం ఉంది. చైనా నుండి బయటకి వచ్చిన పెట్టుబడిదారులు కంపెనీలు భారత్ వైపు వచ్చేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. చైనా కి భారీ షాక్ ఇచ్చిన జగన్ భారత్ కి కలిసొచ్చే నిర్ణయం తీసుకుందని అంటున్నారు విశ్లేషకులు.