కరోనా నుంచి బయటపడేసేది ఆ విటమిన్ మాత్రమే !

NAGARJUNA NAKKA

కరోనా విజృంభిస్తుండడంతో దానిని కట్టడి చేయడానికి సైంటిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విటమిన్‌-D లోపం ఉన్న వాళ్లపై కరోనా ప్రభావం అధికంగా ఉన్నట్టు గుర్తించారు. విటమిన్‌-D సమృద్ధిగా ఉన్న వాళ్లు కరోనాను త్వరగా కోలుకుంటున్నారు. మరోవైపు D-విటమిన్‌ లోపంతో బాధపడుతున్న వాళ్లకు కరోనా అధికంగా సోకడంతో పాటు పలు సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నట్టు గుర్తించారు నిపుణులు. 

సాధారణంగా సూర్యరశ్మి ద్వారా మనకు విటమిన్‌-D లభిస్తుంది. కానీ... ఎండ తగలని రీతిలో ఇళ్లు, కార్యాలయాలకే పరిమితమయ్యే నగర వాసుల్లో దాదాపు 80 శాతం మందికి డి-విటమిన్‌ లోపం ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కరోనా ప్రభావం అధికంగా ఉండడానికి కూడా డి-విటమిన్‌ లోపమే కారణమని తెలుస్తోంది. విటమిన్‌-D లోపం వల్ల శరీరంలో రోగని రోధక శక్తి తగ్గుతుంది.   

సాధారణంగా మనకు ఏదైన వైరస్‌ సోకినప్పుడు సైటోకీన్స్‌ అనేవి సైనికుల్లా పనిచేస్తాయి. శరీరంలోకి వచ్చిన శత్రువుల్లాంటి వైరస్‌లపై దాడిచేసి వాటిని నాశనం చేస్తాయి. కానీ మిటమిన్‌-D లోపం ఉన్న వాళ్లలో రోగిని వైరస్‌ నుంచి కాపాడాల్సిన సైటోకీన్సే ఎదురుదాడి చేసి శరీరంలోని ఇతర మూలకణాలను దెబ్బతీస్తాయి. దాని వల్ల రోగిలో రక్త కణాలు దెబ్బతిని గుండె, కిడ్నీలు, కాలేయం వంటి ప్రధాన అవయవాలు సరిగా పనిచేయవు. అంటే... సైటోకీన్స్‌ సక్రమంగా పనిచేయాలంటే మనకు విటమిన్‌-D అవసరం. 

విటమిన్‌-D లోపం వల్ల ఎముకలు బలహీనమవుతాయి. కండరాలు పటుత్వం కోల్పోతాయి. గుండె జబ్బులు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. సూర్య కిరణాలతో పాటు చేపలు, గుడ్లు, వెన్న, పాలు తదితర వాటిలో విటమిన్‌-D పుష్కలంగా ఉంటుంది. లోపం ఉన్న వాళ్లు క్రమం తప్పకుండా వైద్యుల సలహా మేరకు తక్కువ డోస్‌లో కొంత కాలం పాటు విటమిన్‌-D మాత్రలను వినియోగించాల్సి ఉంటుంది. రోజు కనీసం అరగంట పాటు ఎండలో ఉంటే సహజంగానే విటమిన్‌-D మనకు లభిస్తుంది.

హైదరాబాద్‌లో నమోదవుతున్న కరోనా కేసులను పరిశీలిస్తే విటమిన్‌-డి లోపం ఉన్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మృతుల్లోనూ ఈ విటమిన్‌ లోపం ఉన్నవారే అధికం. మరోవైపు విటమిన్‌-D సమృద్ధిగా ఉన్న వాళ్లు త్వరగా కోలుకుంటున్నారు. వాళ్లలో రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటోంది. అందువల్ల విటమిన్‌-D సమృద్ధిగా ఉంటే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవడం ఎంతైనా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: