
చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. రూ.10,000 పొందండిలా..!
మోదీ ప్రభుత్వం అదిరిపోయే స్కీంను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీం పేరు స్వనిధి పథకం. వీధి వ్యాపారులకు మాత్రమే వర్తించే ఈ స్కీంకి మీరు అర్హలైతే సులభంగా రుణం పొందవచ్చని కేంద్రం పేర్కొంది.కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు అదిపోయే స్కీం ఆఫర్ ను ప్రారంభించింది. పీఎం స్వనిధి పథకం ద్వారా సులభంగా రుణం పొందే సదుపాయాన్ని కల్పించనుంది. వీధి వ్యాపారులు, కిరణా షాపులు, చిన్న చిన్న షాపులు ఉండి.. అర్హత కలిగిన వారు తక్కువ వడ్డీకే రుణాన్ని పొందవచ్చు.
పీఎం స్వనిధి పథకం కింద కేంద్రం రూ.5000 కోట్లును కేటాయించింది. దీని కింద గరిష్టంగా రూ.10,000 వరకు ఎటువంటి కఠిన నిబంధనలు లేకుండా రుణం కల్పిస్తోంది. వచ్చిన డబ్బుతో వ్యాపారం, వడ్డీ రాయితీ పద్దతిన లోన్ కూడా తీసుకోవచ్చు. తీసుకున్న మొత్తాన్ని క్రమం తప్పకుండా వ్యాపారస్థులు వడ్డీ చెల్లిస్తే భారం కూడా తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
చిరు వ్యాపారస్థులు, రోడ్ల పక్కన వ్యాపారం చేసుకునే వారు, బండ్ల మీద టిఫిన్ సెంటర్లు, పండ్లు అమ్మేవారికి, కూరగాయలు, లాండ్రీ, పాన్ షాపు, మెకానిక్ షాపు వారు ఈ స్కీం కింద అప్లై చేసుకుని ఇజీగా రుణం పొందవచ్చు. ఈ స్వనిధి స్కీంలో ఏకంగా 50 లక్షల మంది విధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం ఆశిస్తోంది.
చిరు వ్యాపారస్థులు పీఎం స్వనిధి మోజనలో రుణం పొందడానికి అప్లై చేయాలనుకుంటే ముందుగా https://pmsvanidhi.mohua.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లాలి. సైట్ ఓపెన్ చేసిన తర్వాత అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి. వెండర్ కేటగిరి సెలక్ట్ చేసుకుని, అప్లికేషన్ ఫామ్ లో మీ పేరు, చిరునామా పొందుపర్చాలి. ఆ తర్వాత సంబంధిత డాక్యుమెంట్లను అప్ లోడ్ చేసి అప్లికేషన్ ను సబ్ మిట్ చేయాలి. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, అర్బన్ లోకల్ బాడీస్ జారీ చేసే వెండర్ ఐడీ కార్డులు అప్లైకి అవసరమవుతాయి. ఆ సర్టిఫికెట్లు ఉన్నట్లయితే చిరువ్యాపారులు సులభంగా లోన్ ను పొందవచ్చు.