రైలులో పరిచయం.. తర్వాత ప్రేమ.. చివరికి పోలీస్ స్టేషన్ వరకు..?
కానీ ఆ యువతి ఆ వ్యక్తి యొక్క దుర్బుద్ధి గ్రహించలేక పోయింది. ప్రేమ పేరుతో ఎన్నో మాయమాటలు చెప్పాడు. చివరికి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇక సదరు యువతిపై కామవాంఛను తీర్చుకున్నాడు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి ముఖం చాటేసి ఆ యువతి జీవితాన్ని అయోమయంలో పడేసాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఆ యువతి... పోలీసులని ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతాలపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక ఇటీవలే నర్సింగ్ కోర్సు పూర్తిచేసింది. ఈ క్రమంలోనే హైదరాబాదుకు రైలు లో వచ్చే క్రమంలో.. తోటి ప్రయాణికుడు అయిన మణుగూరు కు చెందిన సింగరేణి ఉద్యోగి వివేకానంద తో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత ఒకరితో ఒకరు చరవాణి ద్వారా మాట్లాడుకోవడం ప్రారంభించారు. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. ఇక ఇదే అదునుగా భావించిన వివేకానంద యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యువతిపై తన కామ వాంఛ తీర్చుకున్నాడు. ఇలా ఐదు నెలల సమయం గడిచిన తరువాత పెళ్లి చేసుకోమని ఆ యువతి ఒత్తిడి తీసుకురావడంతో మొహం చాటేశాడు వివేకానంద. మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇక నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Powered by Froala Editor