ఆస్తిలో ప్రియురాలు వాటా అడిగిందని... ఎంతపని చేసాడు..?
ఈ క్రమంలోనే మోరగెరె చెందిన సిద్ధ లింగప్ప తో ఆమెకు పరిచయం ఏర్పడి.. పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఇంకేముంది పదిహేనేళ్ల నుంచి సిద్ధ లింగప్ప సదరు మహిళ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా ప్రియురాలు హులిగమ్మ సిద్ధ లింగప్ప ఆస్తిలో వాటా అడగాలని భావించింది. ఇక ఈ విషయాన్ని సిద్ధ లింగప్ప దగ్గరికి తీసుకెళ్లి ఆస్తిలో వాటా కావాలంటూ డిమాండ్ చేస్తూ ఒత్తిడి తీసుకు వచ్చింది. అయితే ఆస్తి మొత్తం తన కుటుంబానికి చెందుతుందని తన కోరికలు తీరుస్తున్నందుకు నెలనెలా కొంచెం ఇస్తున్నాను కదా అంటూ సమాధానమిచ్చాడు లింగప్ప. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి వీరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రియురాలి తీరుతో విసిగిపోయిన సిద్ధ లింగప్ప ప్రియురాలి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ప్లాన్ ప్రకారం 13వ తేదీన ఆమెను పొలానికి తీసుకెళ్లి చంపి పొలంలోనే పాతి పెట్టాడు. ఇక రెండు రోజుల నుంచి హులిగమ్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులను ఆశ్రయించగా... ఈ క్రమంలోనే సిద్ధ లింగప్ప తో అక్రమ సంబంధం ఉందని పోలీసు విచారణలో తేలింది. దీంతో సిద్ధలింగప్ప ను అరెస్ట్ చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. పొలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పంపి.. నిందితుడిని కటకటాల వెనక్కి తోశారు.Powered by Froala Editor