రోగాలు చెప్పిరావు... రోగాలు ఏ పరిస్థితుల్లో వస్తాయో తెలియవు. ఇటువంటి పరిస్థితుల్లో రోగాలు వచ్చినవారు రోగం నయం చేసుకోవడం కోసం హైదరాబాద్ కు వెళ్లడానికి వీలులేకుండా పోయింది. దీంతో రోగాలు సోకిన వారు వారికి సోకిన జబ్బులను బాగుచేయించుకోవడం కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సారు తమ ఆరోగ్యం బాగా లేదని అందుకే వెళ్తున్నామంటు సమాదానం చెబితే అదంతా తెలియదని పోలీసులు రోగులను సైతం అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లకుంటే చనిపోయే విధంగా ఉందని రోగుల కుటుంబీకులు పోలీసులను వేడుకుంటే చనిపోతే చావుచేయండి అనే పద్దతిలో పోలీసులు వేదింపులకు గురిచేస్తున్నారు. దీంతో ప్రయాణించే రోగులు ఇబ్బందుల పాలవుతున్నారు.
చనిపోతే చావుచేయండి, బతికుంటే తిండి పెట్టండి అనే విధంగా ఉంది పోలీసుల తీరు. తమ ఆరోగ్యం బాగా లేదని అందుకోసం హైదరాబాద్ కు తాము వెళ్తున్నామని కారులో వెళ్లుంటే వారిని పోలీసులు రకరకాల ప్రశ్నలతో వేదిస్తున్నారు. చివరకు ఆసుపత్రికి వెళ్తున్నారని పోలీసులు నమ్మితే వారిని వదిలి వేస్తున్నారు. ఇలా దారి పొడవున ప్రతి చేక్ పోస్టు వద్ద ఇటువంటి ప్రశ్నలే బాధితులను వేదిస్తున్నాయి. ఇలా సమయం అంతా వృదా చేసుకుంటుంటే వారి ఆరోగ్యం మరింత క్షీణించే పరిస్థితుల గూర్చి కూడా పోలీసులు ఆలోచించడం లేదు.
రోగాలకు వయస్సు తెలియదు, ఏవయస్సవారికైనా రోగం రావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా యువకులు తమ రోగాలతో హైదరాబాద్ ఆసుపత్రికి కారులోగాని బస్సులో గాని ప్రయాణిస్తుంటే ఇకా ఆ యువకులకు ఇబ్బందులే ఎదురవుతాయి. మంచిగానే కనిపిస్తున్నవు నీకు రోగమొచ్చిందా అనే పోలీసుల వేదింపులు ప్రయాణించే యువకులకు తప్పడం లేదు. ఇతర దేశాలకు వెళ్తున్నట్లు, సరిహద్దుల్లో ఇనుపకంచెలను దాటుతున్నట్లు, పాస్ పోర్టు లేకుండా ప్రయాణిస్తున్నట్లు ఇలా ఎవరి ప్రాంతం వారు వారి ప్రాంతంలోకి వెళ్తుంటే వేదింపులు తప్పడం లేదు. కాగా ఇటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు ఎప్పడు జరుగక పోవచ్చు. ఇటువంటి సమస్యలకు పరిష్కరం లేకపోతే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత గందరగోళానికి గరిచేసే అవకాశాలున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: