చైనా భారత్ వివాదం : డ్రాగన్ కు కంటిమీద కునుకు లేకుండా లఢక్ ను అభివృద్ధి చేస్తున్న భారత్....?
చైనా భారత్ సరిహద్దు వివాదానికి డ్రాగన్ పైకి ఎన్ని కారణాలు చెబుతున్నా ఇతర కారణాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. భారత్ లఢక్ లో చేపడుతున్న అభివృద్ధి పనులు డ్రాగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారత్ వాస్తవాధీన రేఖ దగ్గర రహదారుల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. భారీ రహదారులు, వంతెనలను లఢక్ లో నిర్మించడం ద్వారా అన్ని ప్రదేశాలకు మార్గం సుగుమం అయ్యేలా భారత్ కృషి చేస్తోంది.
లేహ్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి వల్ల మిలిటరీ ఆపరేషన్స్ సైతం సులభతరం కానున్నాయి. భారత్ లేహ్ ఎయిర్ పోర్టులో కుశక్ బకులా రింపోచె పేరుతో టెర్మినల్ ను నిర్మిస్తోంది. ఈ టెర్మినల్ ద్వారా లడఖ్ ను దేశంలోనే అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశంగా భారత్ తీర్చిదిద్దనుంది. లేహ్ ఎయిర్ పోర్టును మరింత అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను మరింత ఆకర్షించవచ్చనునని భారత్ భావిస్తోంది.
ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ఎయిర్ పోర్టుగా లేహ్ ఎయిర్ పోర్టుకు మంచి గుర్తింపు ఉంది. ఈ ఎయిర్ పోర్టులో లఢక్ లోని సుందరమైన ప్రదేశాలు, బౌద్ధ మతం సంస్కృతి, సంప్రదాయాలు, హిమాలయాల సొగసును వర్ణించేలా స్థూపాలు ఏర్పాటు కానున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రం లడఖ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. లడఖ్ కు పర్యాటక రంగం ద్వారా మాత్రమే ఆదాయం చేకూరనుంది.
భారత్ లడఖ్ ను భూతలస్వరంగా చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. జరుగుతున్న అభివృద్ధిని చూసి చైనా ఓర్వలేకపోతుందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. లడఖ్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే డ్రాగన్ భారత్ ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జూన్ 30వ తేదీన ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో బలగాల ఉపసంహరణ గురించి ఒక నిర్ణయానికి దేశాలు సైనికులను వెనక్కు పంపుతున్నాయి.