
మద్యం కేసులో చిక్కుకున్న టాలీవుడ్ డైరెక్టర్...!
దేశంలో కరోనా విలయతడవం చేస్తుంది. రోజురోజుకు బాధితుల సంఖ్యా పెరుగుతూనే ఉంది కానీ తరగడం లేదు. అయితే రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులతో మద్యం షాపులు ఓపెన్ చేశారు. దింతో మద్యం ప్రియలు మద్యం తాగడానికి చాల పోరాటాలు చేస్తున్నారు. అంతేకాకుండా లాక్ డౌన్ సడలింపు జరిగిన దగ్గర నుండి అక్రమ మద్యంతో చాల మంది పోలీసులకు పట్టుపడుతున్నారు.
అయితే తాజాగా విశాఖపట్నం జిల్లా కోటవురట్ల మండలం బోడపాలెంలో పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో తెలంగాణా రాష్ట్రానికి చెందిన మద్యం సీసాల కేసులో తెలుగు సినీ దర్శకుడి పాత్ర ఉందని వెలుగులోకి వచ్చింది. ఆ మద్యం సీసాలను తెలంగాణ నుంచి తీసుకొచ్చింది సినీ డైరెక్టర్‌గా దొరబాబుగా తేలినట్లు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) నర్సీపట్నం సీఐ సంతోష్ తెలియజేశారు.
అయితే నర్సీపట్నం మండలం జోగునాథునిపాలెం గ్రామానికి చెందిన దొరబాబు గతంలో ఓ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించినట్లు సీఐ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. అయితే ఆయన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
బోడపాలెంలో 85 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జోగునాయుడు, సతీష్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? సినీ దర్శకుడు మరెరికైనా మద్యం సరఫరా చేశాడా? అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన సతీష్ జోగునాథునిపాలెం గ్రామానికి చెందిన మాజీ కౌన్సిలర్ వి.శ్రీనివాసరావుకు స్నేహితుడని తెలిపారు.
దీంతో పోలీసులు ఆయన ఇంట్లోనూ తనిఖీలు చేయగా ఏపీకి చెందిన 8 మద్యం సీసాలు దొరికాయన్నారు. నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలోనూ పి.శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో 8 తెలంగాణ మద్యం సీసాలు, 6 ఏపీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.