వీళ్లు ఎర్రోళ్లా.. పిచ్చోళ్లా.. వెంటిలేటర్ ప్లగ్ పీకి.. కూలర్ ప్లగ్ పెట్టారు.. చివరికి..
ఈ మద్య దేశంలో కరోనా వల్ల కొంత మంది తాము ఏం చేస్తున్నామో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దేశంలో ఓ వైపు కరోనా వైరస్ తీవ్రత పెరిగిపోతుంది. ఇక కరోనాకి చికిత్స లేదు.. వ్యాక్సిన్ ఇంకా కనుగొనలేదన్న విషయం తెలిసిందే. కేవలం మనం సామాజిక దూరాన్ని పాటించాలి.. మాస్క్ ధరించాలి.. శానిటైజర్ తప్పకుండా దగ్గర ఉంచుకోవాలని అంటున్నారు. మనం ఎంత జాగ్రత్త పడితే అంత మంచిదని అంటున్నారు. తాజాగా ఓ కరోనా రోగి బంధువులు చేసిన అత్యుత్సాహం.. వెర్రి తనం వల్ల అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో జరిగింది.
ఓ కరోనా బాధితుడు స్థానిక మహారావు భీమ్‌సింగ్ (ఎంబీఎస్) హాస్పిటల్ లో వెంటిలేటర్‌పై ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ మద్య అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దెబ్బ తినడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇటీవల అతన్ని చూడడానికి కుటుంబ సభ్యులు వచ్చారు. తమతోపాటు ఓ చిన్నపాటి కూలర్‌ను తెచ్చారు. ఇక్కడే ఆ కుటుంబ సభ్యులు చేసిన పిచ్చిపనికి అన్యాయంగా రోగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
ఇంతకీ వాళ్లు ఏం చేశారోతెలుసా.. ఐసీయూలో ఆ కూలర్‌ను ఆన్ చేసేందుకు అక్కడే ఉన్న వెంటిలేటర్ ప్లగ్ తీశారు. దాని స్థానంలో కూలర్ ప్లగ్ పెట్టి దాన్ని ఆన్ చేశారు. అయితే కాసేపటి వరకు వెంటిలేటర్ బ్యాటరీపై నడిచింది. కానీ, అందులో ఉన్న పవర్ కూడా అయిపోయింది. ఇంకేముంది అందాల్సిన ఆక్సీజన్ ఆ కరోనా రోగికి అందకపోవడంతో గాల్లో ప్రాణాలు కలిసిపోయాయి.