శ్రీలంకను నాశనం చేసిన చైనా...ఏం చేసిందంటే....?
మన పెద్దలు ఎప్పుడూ దుష్టులకు దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మనం ఆ మాటలను పట్టించుకోకుండా దుష్టులకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. చైనా దేశం పరోక్షంగా శ్రీలంక ప్రజల్లో భారత్ పై వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నించింది. దానికి అనుగుణంగా మన దేశం వ్యవహారశైలి కూడా ఉంది. శీలంకలోని తమిళియన్లు ప్రత్యేక దేశం కావాలని కోరడం..... శ్రీలంకలోని ఎల్టీటీఈ సంస్థకు తమిళనాడు సహకారం అందించడం జరిగింది.
అనంతరం శ్రీలంకలోనే లోకల్ గా ఉన్నవాళ్లు మన దేశం నుంచి వచ్చిన వాళ్ల పట్ల చాలా అపనమ్మకంతో ఉన్నారు. భారత్ శ్రీలంకకు కొంతవరకు సహాయం చేయగలదు కానీ ఎక్కువగా సహాయం చేయాలన్నా చేయలేదు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని చైనా తెలివైన ఎత్తుగడ వేసింది. చైనా భారత్ పై ఏ స్థాయిలో వ్యతిరేకత పెంచిందంటే శ్రీలంక ఒక పోర్టును భారత్ కు ఇస్తే దానికి వ్యతిరేకంగా మన దేశం ఎంబసీ ముందు అక్కడ ఉద్యమాలు జరిగాయి.
శ్రీలంకను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా భావిస్తోంది. చైనా అందుకోసం శ్రీలంకలో వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. శ్రీలంకలో రహదారులు, హైటెక్ కాన్ఫరెన్స్ సెంటర్, క్రికెట్ స్టేడియం, నౌకాశ్రయం నిర్మించటం జరిగింది. ఎల్టీటీఈతో సివిల్ వార్ ముగిసిన ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో శ్రీలంక చైనా సహాయం తీసుకుంది.
చైనా శ్రీలంకలో ఒక విమానశ్రయాన్ని కూడా నిర్మించింది. శ్రీలంకలో చైనా పెట్టుబడులు పెరిగిపోతూ ఉండటంతో ఆ దేశం సంక్షోభంలో పడుతోంది. శ్రీలంక ప్రస్తుతం చైనాకు వడ్డీలు కూడా కట్టే పరిస్థితి లేదని నెలకొంది. కేవలం విమానశ్రయానికే ఏడాదికి 950 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరి నుంచి శ్రీలంక చైనాకు 1520 కోట్లు చెల్లించాలి. చైనా శ్రీలంకలో మౌలిక సదుపాయాలు కల్పించి... ప్రపంచ దేశాలు ఆ దేశాన్ని పట్టించుకోకుండా చేసి.... ఆ దేశాన్ని నాశనం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.