డ్రాగన్ సైన్యం సర్వం సన్నద్ధం... చైనాకు భారత్ షాక్?
గత నెలరోజులుగా చైనా భారత్ సరిహద్దు వివాదం గురించి భారీగా చర్చ జరుగుతోంది. శనివారం రోజున ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు చర్చలు జరిపినా ఆ చర్చలు ఫలించలేదు. ఇరు దేశాలు సమస్యను శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోనున్నాయని వార్తలు వచ్చినా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వివాదం ఇప్పట్లో పరిష్కారం అవుతుందా...? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
చైనా ఇప్పటికీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తూ భారత్ చైనాను ఇబ్బంది పెడుతోందంటూ వ్యాఖ్యలు చేస్తుంది. చైనా భారత్ తో ప్రస్తుతం యుద్ధం చేసే స్థితిలో లేదు. అదే సమయంలో చైనాకు వెనక్కు వెళ్లే ధైర్యం కూడా లేదు. దీంతో చైనా చిత్రవిచిత్రమైన ఎత్తుగడలను వేస్తోంది. ఒక పక్కన చైనా శాంతియుతంగా ఇతర దేశాల సహాయం లేకుండా సమస్యను పరిష్కరించుకుంటామని చెబుతోంది.
మరోవైపు చైనా సరిహద్దులో సైనికులతో విన్యాసాలు చేయిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసే యుద్ధానికి సన్నద్ధం అనే సంకేతాలను ఇస్తోంది. దీంతో మన సైనికులు కూడా సరిహద్దుల్లోని యుద్ధ ట్యాంకులను మూవ్ చేస్తూ యుద్ధానికి సిద్ధమనే సంకేతాలను ఇచ్చారు. భారత్ చైనా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎక్కడా తొందర పడకుండా.... ఎక్కడా వెనక్కు తగ్గకుండా చైనాకు భారత్ చిన్న చిన్న షాకులు ఇస్తోంది.
భారత్ సైనికులు సోషల్ మీడియా ద్వారా కూడా చైనాతో వార్ చేస్తూ డ్రాగన్ దేశానికి చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని చైనా చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియోలను పోస్ట్ చేస్తోంది. దానికి కౌంటర్ ఇస్తూ భారత సైన్యం సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తోంది. భారత్ ను వీడియోల ద్వారా భయపెడదామని భావించిన చైనాకు భారత్ రివర్స్ లో షాకులు ఇవ్వడం గమనార్హం.