
జగన్ దూకుడు కి ఫిదా అవుతున్న ఏపీ జనం.. !
ఏపీలో అధికార వైసిపి దూకుడు ముందు విపక్ష ఎల్లో మీడియా సైన్యం విలవిలలాడుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు అప్పట్లో విపక్ష వైసీపీకి చెందిన ఏ కార్యకర్త లేదా... నాయకుడు అయిన సోషల్ మీడియాలో అప్పటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఏ చిన్న పోస్ట్ పెట్టినాన ప్రభుత్వం నుంచి పోలీసు అధికారుల నుంచి తీవ్రమైన చర్యలు ఉండేవి. అప్పట్లో వైఎస్ఆర్ పార్టీ ఎంత గగ్గోలు పెట్టినా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకునేది కాదు. వైసీపీ తరఫున ఎవరైనా అనుకూలంగా పోస్టులు పెట్టినా... తెలుగుదేశం పార్టీ ని ఎవరైనా విమర్శించిన వారిని వేటాడి వెంటాడుతూ కేసులు పెట్టడం జరిగింది.
ఇక ఇప్పుడు వైసిపి అధికారంలో ఉండటంతో ఆనాడు తెలుగు దేశం పార్టీ వేసిన ఎత్తులను అదే తరహాలో తిప్పి కొడుతోంది. ఈ విషయంలో ఎంతటి వారు అయినా సరే ఏ మాత్రం వదలవద్దని ప్రభుత్వం నుంచి నేరుగా ఆదేశాలు కూడా వచ్చినట్టు సమాచారం. వాస్తవంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఎల్లో మీడియా జగన్ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రతి రోజూ విమర్శలు చేస్తూ వ్యతిరేక కథనాలు వండి వార్చుతోంది.
ఇక ఇప్పుడు జగన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే వారి విషయంలో ఉపేక్షించ వద్దని అధికారులకు సూచనలు జారీ చేసినట్టు సమాచారం. వాస్తవంగా చూస్తే ఐదేళ్ల టీడీపీ పాలనలో తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించి కూడా ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని.. ఇప్పుడు టీడీపీ వాళ్లు ప్రభుత్వంపై.. జగన్‌పై అంతకు మించి విష ప్రచారం చేస్తుంటే వాళ్లపై కేసులు పెట్టడంలో తప్పేం లేదని అంటున్నారు. ఈ విషయంలో జగన్ దూకుడుగా ముందుకు వెళుతోన్నందుకు ఏపీ వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నాయనడంలో సందేహం లేదు.