ఆమ్మో శ్రీ రెడ్డి మళ్ళీ రెచ్చిపోయిందిగా...! ఈ సారి హైపర్ ఆది వంతు ...!

Suma Kallamadi

నటి శ్రీ రెడ్డి పేరు వింటే చాలు వామ్మో అంటారు అందరు.. ఎందుకంటే ఎవరినన్నా విమర్శించాలంటే శ్రీ రెడ్డి ముందు ఉంటుంది. అందుకే శ్రీరెడ్డి ని  వివాదాస్పద నటి అంటారు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో తెలియదు.  ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తనకు సంబంధం లేకపోయినా సరే ఎవరో ఒకరిని విమర్శిస్తూనే ఉంటుంది.. అయితే ఎప్పుడు తాజాగా  శ్రీరెడ్డి మళ్ళీ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది..

 

శ్రీరెడ్డి రాను రాను వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.ఈసారి  ఎవరిని  టార్గెట్ చేయిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.అతను ఎవరో కాదు  జబర్థస్థ్ ఫేం హైపర్ ఆది. అసలు హైపర్ ఆదికి శ్రీరెడ్డికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా..! ఎవరితో సంబంధం లేకుండా వివాదస్పద వ్యాఖ్యలు చేయడమే శ్రీ రెడ్డి స్టైల్.అసలు ఆది ని టార్గెట్ చేయడానికి కారణం తెలిస్తే అవాక్ అవుతారు. అసలు వివరాలలోకి వెళితే.  జబర్థస్త్‌తో వరుస పంచ్‌లతో ఆకట్టుకునే టీం లీడరహైపర్‌ ఆది.కామెడీ పంచ్ లతో ప్రేక్షకులకు చేరువ అయ్యాడు.  పలు చిత్రాల్లోనూ నటించిన ఈ కామెడీ స్టార్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఇటీవల పప్రకటించాడు.

 

జబర్ధస్త్‌కి, ఆది పంచ్‌లకు ఉన్న క్రేజ్‌ కారణంగా ఆది పెళ్లి వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ మీడియాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్‌ మారింది. దీంతో  మన శ్రీరెడ్డి కి కోపం వచ్చేసింది అనుకుంట. "హైపర్‌ ఆదికి  గానీ పెళ్లైతే కరోనా చస్తదా"..? ఆన్‌ లైన్‌లో వాని పెళ్లి మీద ఓ గోల, 42 ఇయర్స్‌లో ఇప్పుడు పెళ్లి చేసుకోక పోతే ఏంది?` అంటూ కామెంట్‌ చేసింది శ్రీరెడ్డి.

 

ఇంకేముంది ఈ వార్త క్షణాల్లో సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యాయి. అలాగే ఆది పై చేసిన కామెంట్స్‌ కూడా వైరల్‌ అయ్యాయి.ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో ప్రముఖులను టార్గెట్‌ చేస్తూ శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌ ఇండస్ట్రీ వర్గాలకు కోపం తెప్పించాయి.ఇప్పుడు ఆదిని టార్గెట్ చేసింది.దీనికి ఆది ఏవిధంగా సమాధానం ఇస్తాడో అని హైపర్ ఆది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: