రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు... కేంద్రం ఏం చేస్తుందో...?

Reddy P Rajasekhar

మూడు రోజుల క్రితం సుప్రీం కోర్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీం రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారి ఆర్థిక పరిస్థితిని బట్టి రిజర్వేషన్ కులాల జాబితాలను మార్చాలని పేర్కొంది. న్యాయస్థానం తీర్పులో కొన్ని కులాల్లో సంపన్నులకే ఫలాలు దక్కుతున్నాయని పేదలకు అన్యాయం జరుగుతోందని పేర్కొంది. కులాల జాబితాలను సవరించడం తప్పనిసరి అని ప్రకటన చేసింది. 
 
 
నిజానికి ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని అనేక వర్గాలు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని చెబుతున్నాయి. రిజర్వేషన్ల వల్ల చాలామంది సంపన్నులు కాగా అందని వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల రిజర్వేషన్ కు అర్హులైన వర్గాల్లోనే గొడవలు జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వేషన్లు ఎవరు సరైన అర్హులు..? అనే ప్రశ్న వ్యక్తమవుతోందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. 
 
కులాల జాబితాలను సవరిస్తే ఇప్పటికే వాటిని అనుభవిస్తున్న వారికి తన్నుకుపోకుండా చూడగలమని అభిప్రాయపడింది. సుప్రీం చేసిన వ్యాఖ్యలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. రిజర్వేషన్ల తేనెతుట్టను కేంద్రం కదిలిస్తుందో లేదో చూడాల్సి ఉంది. దేశంలో పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండటం వల్ల కులాల జాబితాలను సవరించడం అంత తేలిక కాదు. 
 
గతంలో ఈ ప్రయత్నం జరిగినప్పుడల్లా రిజర్వేషన్లు తీసేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నం చేసే అవకాశం కేంద్రానికి ఉండదు. ఇప్పటివరకూ రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం పొందిన వారి జాబితా తీయడం అంత సులభమేమీ కాదు. సుప్రీం కీలక వ్యాఖ్యలపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. కేంద్రం ఇందుకోసం సర్వేలు చేసినా ఆ సర్వే పూర్తవడానికి ఐదు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఆలోపు కేంద్రంలో అధికారంలోకి మరో పార్టీ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: