బ్రేకింగ్: కరోనాకు విరుగుడు రెడీ... 3 నెలల్లో అందుబాటులోకి..!

Suma Kallamadi

అవును.. మీరు చదివింది నిజమే.. కరోనా తాండవం చేస్తున్నవేళ, వివిధ దేశాలు దానికి విరుగుడిని కనిపెట్టే పనిలో పడ్డాయి. ప్రస్తుతం.. ఆస్ట్రేలియా లోని, సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ - CCRO ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే.. కరోనా వైరస్ నివారణలో భాగంగా, వాక్సిన్‌ టెస్టింగ్ దశను ఆల్రెడీ  ప్రారంభించింది. అయితే.. ఈ వాక్సిన్ పరీక్ష ప్రాసెస్ కనీసం మూడు నెలల సమయం పడుతుందని పేర్కొనడం గమనార్హం.

 

ఆ మధ్య, చైనా గవర్నమెంట్ అనుమతితో.. వుహన్ లో మార్చి నెలలో అక్కడ కనుగొన్న వ్యాక్సిన్‌కు తొలిదశ ట్రయిల్స్ ను మొదలుపెట్టిన సంగతి విదితమే. ఇక ఈ వ్యాక్సిన్ ప్రయోగం కూడా సక్సెస్ అయ్యిందని... త్వరలోనే రిపోర్టు విడుదల చేస్తామని... చైనీస్ అకాడమీ అఫ్ ఇంజనీరింగ్ సభ్యుడు "చెన్ వీ" చెప్పడం కూడా అందరికి తెలిసినదే. ఇక ఆ రిపోర్టు ఈ నెలలోనే విడుదల కాబోతోంది...

 

ఇకపొతే, ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లాబొరేటరీలోని.. బయో సెక్యూరిటీ కేంద్రంలో అత్యంత భద్రత కలిగిన జీలాంగ్‌లోని ఆయా ప్రయాగాన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. కోయలేషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్ నెస్ ఇన్నోవేషన్స్ - CEPIతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే, సదరు వాక్సిన్ పై పరీక్షలు చేసినట్టు సీసిరో పేర్కొంది.

 

అలాగే... బ్రిటీష్‌ అమెరికన్‌ టొబాకో - BAT కంపెనీ... పొగాకు మొక్కల నుంచి వాక్సిన్‌ను తయారుచేసి, కరోనాను తరిమి కొడతామని ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసారు. ఇందులో భాగంగానే ఎలాగైనా వాక్సిన్‌ను కనుగొనాలనే లక్ష్యంతో తమ అనుబంధ సంస్థ, కెంటకీ బయో ప్రాసెసింగ్‌ - KBP తో కలిసి.. పొగాకు మొక్కలతో ప్రయోగాలు నిర్వహించి.. పిదప తమ వాక్సిన్‌ను జంతువులపై ప్రయోగించి, ఆ తర్వాత మానవులపై ప్రయోగాలు నిర్వహిస్తామని చెప్పడం గమనార్హం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: