
జగన్ కేబినెట్లో కొత్త మంత్రులు వీళ్లే... ఆ మహిళా ఎమ్మెల్యే కూడా...!
ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే ఏప్రిల్ తొలి వారంలో జగన్ కేబినెట్‌ను విస్తరించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మండలి రద్దు కావడం.. మండలి నుంచి మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ రాజ్యసభకు ఎంపిక కావడంతో ఇప్పుడు వీరిద్దరి స్థానాల్లో మరో ఇద్దరు కొత్త మంత్రులను తీసుకోవాల్సి ఉంది. ఇక జగన్ ప్రస్తుతం కేబినెట్లో ఉన్న మంత్రుల్లో కొందరి మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు.
ఇక ఈ లిస్టులో ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రితో పాటు రాయలసీమ జిల్లాలకు చెందిన మరో మంత్రి పనితీరుపై కూడా జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు టాక్.. ? ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జగన్ కొందరు శాఖలను మారుస్తారని.. మరి కొందరు మంత్రులకు ఊస్టింగ్ కూడా తప్పదని అంటున్నారు. ఇక వీరి ప్లేసుల్లో కొందరు కొత్తవారికి మంత్రి పదవులు లభిస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ లిస్టులో ఈ బోస్, మోపిదేవితో పాటు మరో మొత్తం నలుగురైదుగురు కొత్త వారు ఉండవచ్చని అంచనా.
ఈ లిస్టులో విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, krishna REDDY' target='_blank' title='ఆళ్ల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాదరావు పేర్లతో పాటు మంత్రి తమ్మినేని సీతారాం పేర్లు రేసులో ఉన్నాయి. మహిళా కోటాలో కళావతి పేరు లైన్లో ఉంది. ఇక రోజా సరేసరి. ధర్మాన ప్రసాదరావుకు పదవి ఇవ్వాలంటే ఆయన సోదరుడు కృష్ణదాస్‌ను తప్పించాలి. ఇక సీతారాంకు మంత్రి పదవి ఇస్తే... ఆయన స్పీకర్ పదవి మరో వర్గానికి ఇవ్వాలి. ఇక సీమ నుంచి జయరాంతో పాటు శంకర్ నారాయణలను మార్చవచ్చని అంటున్నారు. వీరిద్దరూ కూడా బీసీ వర్గానికి చెందిన వారే. మరి వీరిలో ఎవరికి ఫైనల్‌గా మంత్రి పదవులు వస్తాయో ? చూడాలి.