వైద్యం కోసం వచ్చిన మహిళలకు మత్తు మందు ఇచ్చి రేప్ చేస్తున్న డాక్టర్.. చివరికి
ఎన్ని చట్టాల ను ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొస్తున్న కూడా మహిళల పై జరుగుతున్న అన్యాయాలకు మాత్రం అడ్డు కట్ట వేయలేకపోతుంది. సాధారణ ప్రజలు అఘాయిత్యాల కు పాల్పడ్డారంటే ఎదో అనుకోవచ్చు కానీ, ఇక్కడ గౌరావా వృత్తిలో ఉన్న ప్రభుత్వాధికారులు మహిళల పై లైంగిక దాడికి దిగుతున్నారు. ఇలా ఘటనలు జరగడం బాధాకరం.
యూఎస్‌లో ని ఓహియో రాష్ట్రాని కి చెందిన ప్లాస్టిక్ సర్జన్‌ను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. మత్తుమందిచ్చి రేప్ చేసినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు అతని సెల్‌ఫోన్, అతని కారు, నివాసంలో సోదాలు జరప గా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతని సెల్‌ఫోన్ మెమొరీ కార్డులో అచేతనంగా పడి ఉన్న మహిళలపై రేప్ చేస్తూ తీసుకున్న వీడియోలు బయటపడ్డాయి.
కామంతో కొట్టుకుంటున్న డాక్టరు.. వైద్యం కోసం వచ్చిన మహిళలపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. మత్తు మందు కలిపి ఇచ్చి వారు మత్తులోకి జారుకున్నాక వారిపై పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. దారుణంగా రేప్ చేస్తూ ఆ దృశ్యాలను వీడియోలను తీసి మెమోరీలో సేవ్ చేసుకొని వికృత చేష్టలకు పాల్పడుతూ వస్తున్నాడు.
డాక్టర్ ఆస్పత్రి, నివాసంలో జరిపిన తనిఖీల్లో మరో భయంకరమైన విషయం బయటపడింది. ఆయన గదిలో సెక్స్ టాయ్స్ లభ్యమయ్యాయి. మహిళలకు మత్తుమందు ఇచ్చిన తరువాత రేప్ చేయడంతో పాటు అమానుషంగా సెక్స్ టాయ్స్‌తో వికృత చేష్టలకు పాల్పడుతూ వీడియోలు తీసినట్లు గుర్తించారు. మత్తులో తనపై రేప్ జరిగిందని గ్రహించిన ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసిన పోలీసులు కామాంధుడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అలాంటి కామాంధుడిని బయటకు వదలొద్దని వైద్యం చేయించుకున్న మహిళలు డిమాండ్ చేస్తున్నారు ..