మారుతిరావును శ్రవణ్ కొట్టాడా... తండ్రి మృతి వెనక అమృత షాకింగ్ నిజాలు..!
మారుతీ రావు ఆత్మహత్యపై అమృత తాజాగా మీడియా ముందు వచ్చి స్పందించింది. నిన్నటి వరకూ తన తండ్రి పశ్చాత్తాపంతో చనిపోయాడని చెప్పుకొచ్చిన అమృత ఈరోజు మాట మార్చి మారుతీ రావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని... తన బాబాయ్ అనగా శ్రవణ్ పై తనకి అనుమానం ఉందని చెప్పింది. ఆస్తి పంచివ్వాలని శ్రవణ్, మారుతీ రావు తో గొడవలు పెట్టుకున్నాడని, ఒకానొక సందర్భంలో శ్రవణ్ మారుతీ రావు ని కొట్టాడని ఆమెకు తెలిసినట్టు చెప్పింది. ఆస్తి రాసిచ్చిన వీలునామాలో తన పేరు ఉంటే అనుమానం వస్తుందనే ఉద్దేశంతోనే తన పేరు శ్రవణ్ రాయించుకొలేదని అమృత అభిప్రాయపడింది.
మారుతీరావు కి చట్టపరంగా శిక్ష పడాలని కోరుకున్నాను తప్ప అతను ఆత్మహత్య చేసుకోవాలనే ఏనాడు కోరుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. తన అమ్మ దగ్గరకు వెళ్లే ఉద్దేశం తనకి అసలు లేదని చెప్పిన అమృతం... తన అత్తగారింటికి మారుతీరావు ఒక వ్యక్తిని పంపించి తనని తల్లిగారింటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడని చెప్పింది. ఐతే తన భర్త కుటుంబాన్ని వదిలేసి తాను రాలేనని అవసరమైతే తన తల్లిని తన దగ్గరికి పంపించమని తాను ఆ వ్యక్తి కి చెప్పి పంపించేసినట్టు తెలిపింది.
మారుతీ రావు అంత్యక్రియల కార్యక్రమాలకు వెళ్తే తనని స్మశానం లోపకి రానివ్వకుండా పంపించేయడం కరెక్ట్ కాదని... తాను కేవలం తన అమ్మని ఓదార్చడానికే అక్కడికి వచ్చానని తెలిపింది. ఆస్తి వివరాల గురించి తనకు పూర్తిగా తెలియదని కాకపోతే మారుతీ రావు తన తల్లి గిరిజ శ్రవణ్ కంట్రోల్లోనే ఉంటారని వెల్లడించింది. మారుతీరావు చనిపోవడానికి సోదరుడు శ్రవణ్ మాట్లాడకపోవడమే కారణం కావచ్చని అమృత అనుమానం వ్యక్తం చేసింది.
మరోవైపు మారుతీ రావు లాయర్ వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ... మారుతీ రావు తన కూతురు అమృతాన్ని కాంప్రమైజ్ చేసి తన ఇంటికి తీసుకొచ్చుకునేందుకు 20 సార్లు ప్రయత్నించాడని కానీ అమృత కాంప్రమైజ్ కాలేదని ఆ మనస్థాపం తోనే చనిపోయి ఉంటాడని చెబుతున్నాడు. అలానే ఫాస్ట్ ట్రాక్ విచారణ కారణంగా తనకి త్వరలోనే కఠినమైన శిక్ష పడుతుందనే భయం తో ఆత్మహత్య చేసుకొని ఉంటారని ఇతను అభిప్రాయపడ్డాడు.