ఎల్బీనగర్ లో విషాదం.. ఫ్లై ఓవర్ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Suma Kallamadi

హైదరాబాద్‌ నగరంలోని ఎల్బీ నగర్‌ లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఎల్బీ నగర్‌ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. అక్కడి ప్రయాణికులు, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం దర్యాప్తును ప్రారంభించారు. పోలీసులు మృతుడిని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపెల్లి గ్రామానికి చెందిన నరేందర్‌ గౌడ్‌ గా గుర్తించారు.

 

 

వివరాల్లోకి వెళితే.. నరేందర్‌ గౌడ్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఆర్దికంగా అంతగా ఉండకపోవటం   ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయి. ఆర్థిక సమస్యలకు తోడుగా కుటుంబ కలహాలు కూడా మొదలవడంతో.. అతనికి ఏం చేయాలో అర్ధంకాక, జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

 

 

చనిపోవాలని నిర్ణయించుకున్న నరేందర్ గౌడ్ ఆదివారం అర్ధరాత్రి ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్‌ పైకి చేరుకున్నాడు. అనంతరం నరేందర్‌ ఏమి ఆలోచించకుండా అక్కడి నుంచి కిందికి దూకేశాడు. నరేందర్ గౌడ్ అక్కడికక్కడే మరణించాడు. ప్రయాణికుల సమాచారం మేరకు అక్కడి పోలీసులకు సమాచారం అందించాడు. 

 

 

పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడికి వచ్చి వెంటనే నరేందర్ గౌడ్ ను ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. ఈ ఘటన పై ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య ఘటన పై నరేందర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారమిచ్చారు.

 

 

ఏది ఏమైనా ఆత్మహత్యకు పాల్పడటం సరియైనది కాదని పోలీసులు తెలిపారు. ఏమన్నా ఉంటే మాట్లాడి తేల్చుకోవాలి కానీ.. ఇలా చేయటం వల్ల నరేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు మొత్తం రోడ్డు మీద పడుతుందని ఇంకెప్పుడు ఎవ్వరూ కూడా ఇలా చేయకూడదని తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: