టెలికాం సంస్థలు ఫుల్ స్పీడ్ మీదున్నాయ్..!

NAGARJUNA NAKKA

ప్రైవేట్‌ రంగ టెలికాం సంస్థలు తమ బకాయిల చెల్లింపుల్ని వేగవంతం చేశాయి. భారతీ ఎయిర్‌ టెల్‌ 8 వేల కోట్లను ప్రభుత్వానికి జమ చేసింది. బకాయిల విషయంలో డిజిటల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ కీలక సమావేశంలో ఎలాంటి ఊరట లభించకపోవడం టెలికాం కంపెనీలను నిరాశపర్చింది.  

 

లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్‌ వినియోగ చార్జీలకు సంబంధించి బకాయిల చెల్లింపులను వేగవంతం చేశాయి టెలికాం సంస్థలు. తమ ఆదేశాలను లెక్క చేయకపోవడంపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఆగ్రహంతో వ్యక్తం చేయడం... ప్రభుత్వం నుంచి మళ్లీ ఒత్తి రావడంతో చెల్లింపులు జరుగుతున్నాయి. 

 

బకాయిల చెల్లింపుల విషయంలో టెలికాం కంపెనీలకు ఉపశమనం కల్పించే అంశంపై డిజిటల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ - DCC కీలక సమావేశం జరిగింది. అయితే... రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో టెలికాం కంపెనీల అడ్జస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూ - AGR బకాయిలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. పైగా DCC సమావేశం అర్ధంతరంగా ముగియడం టెలికాం సంస్థలను నిరుత్సాహపర్చింది. 

 

టెలికాం సంస్థలు లక్షా 47 వేల కోట్ల రూపాయల AGR బకాయిలను చెల్లించాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే... బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చాయి సంస్థలు. మరోవైపు... టెలికాం సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ టెలికాం విభాగంలోని ఓ డెస్క్‌ అధికారి ఆదేశాలు ఇచ్చారు. అయితే చెల్లింపులో విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఇటీవల ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియాతో పాటు ఇతర టెలికాం సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. డెస్క్‌ అధికారి తీరుపైనా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 

 

ది టెలికాం విభాగం. డెస్క్‌ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. అలాగే, తక్షణమే బకాయిలు చెల్లించాలని కంపెనీలను ఆదేశించింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీల కింద భారతీ ఎయిర్‌ మొత్తం 35 వేల 586కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే 10వేల కోట్లు చెల్లించిన భారతీ ఎయిర్‌టెల్‌... ఇప్పుడు మరో 8 వేల కోట్లను కట్టింది.

 

ఇదిలా ఉండగా... బకాయిల విషయంలో ప్రభుత్వం ఊరట కల్పించాలని కోరుతున్నాయి టెలికాం కంపెనీలు. లేదంటే తమ సంస్థల మనుగడకే ప్రమాదమంటున్నాయి. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఏ స్పందన రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: