
గర్భిణీ కడుపులో తన్నిన తమ్ముడు... సరైన బుద్ది చెప్పిన మహిళా..?
తమ్ముడు చెల్లెలు గొడవ పడుతున్న సమయంలో వారిద్దరు గొడవ పడకుండా ఆపేందుకు... గర్భవతిగా ఉన్న అక్క వారిద్దరి మధ్య వెళ్లడమే ఆమెకు శాపంగా మారి పోయింది. తమ్ముడు చెల్లిని గొడవ పడకుండా ఆపే క్రమంలో... అక్కకు కడుపు కోత మిగిలింది. సదరు మహిళా తమ్ముడు అక్క గర్భవతి అని కూడా చూడకుండా... తమ్ముడు కర్కశంగా ప్రవర్తించాడు. ఏకంగా అక్క కడుపు పై దారుణంగా కాలితో తన్నాడు తమ్ముడు. దీంతో తీవ్ర రక్తస్రావం అయిన మహిళ... గర్భంలోనే శిశువు మృతి చెందింది. దీంతో ఆ మహిళకు కడుపుకోత మిగిలిపోయింది. తన తమ్ముడు కర్కశంగా ప్రవర్తించి తన కడుపు కోత మిగిల్చడాన్ని సహించలేకపోయింది సదరు మహిళా. దీంతో పోలీసు స్టేషన్లు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే... ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలోని బంధుప్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త తల్లితో కలిసి నివాసం ఉంటుంది. సదరు మహిళ చెల్లి తమ్ముడు కూడా తనతో పాటే కలిసి ఉంటున్నారు. అయితే తాజాగా తమ్ముడు చెల్లెలు నీళ్ల కోసం గొడవ పడుతున్న సమయంలో వారిద్దరి వారించేందుకు మధ్యలో కి వెళ్ళింది అక్క. దీంతో సదరు తమ్ముడు అక్క పై తిరగబడ్డాడు. అదే సమయంలో ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ ఆమెపై దాడి చేశాడు తమ్ముడు. ఈ క్రమంలోనే నాలుగు నెలల గర్భవతి అయిన ఆమె పొత్తి కడుపు పై కాలితో గట్టిగా తన్నాడు తమ్ముడు.
దీంతో తీవ్ర గర్భస్రావం అయిన సదరు మహిళకు... కడుపులోని శిశువు మరణించింది. దీంతో సదరు మహిళకు కడుపు కోత మిగిలింది అనే చెప్పాలి. ఇక తన గర్భం పోవడానికి కారణమైన తమ్ముడిని క్షమించ లేకపోయింది సదరు అక్క. దీంతో తన తమ్ముడి పై పోలీస్ కేసు పెట్టింది. ఇక ఆ మహిళ కడుపులో బిడ్డ చనిపోవడానికి ఆ మహిళ తమ్ముడు ఆ మహిళ కడుపు పై దారుణంగా తన్నడమే కారణమని పోలీసు విచారణలో తేలడంతో.. న్యాయస్థానం అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.