ఇవాంకా ముగ్గురు పిల్లల తల్లేనా... ఆమె అందం సీక్రెట్ ఇదే..!
ఇంకా చెప్పాలంటే హీరోయిన్లకు, మోడల్స్ లను తలదన్నే విధంగా ఉండే ఇవాంకా కి ముగ్గురు పిల్లలు ఉన్నారంటే మనం ఎవ్వరం నమ్మలేం. ఆమె అందం రహస్యం అలాంటిది. రెండేళ్ల క్రితం వరకు ఇవాంకా ట్రంప్ అనే పేరు ప్రపంచంలోనే పెద్దగా ఎవ్వరికి తెలియదు. ఎప్పుడైతే ట్రంప్ సలహాదారుగా ఆమె వచ్చిందో అప్పటి నుంచి ఆమె తన తండ్రి వ్యవహారాలను ప్రపంచ వ్యాప్తంగా చక్క పెట్టేస్తున్నారు.
ఇక ఎప్పుడైతే అమె హైదరాబాద్ పర్యటనకు వచ్చారో అప్పుడే ఇండియా వాళ్లకు కూడా ఆమె గురించి తెలిసింది. అప్పుడే చాలా మంది ఆమె చూపులకు పడిపోయారంటే అతిశయోక్తి కాదు. ఇక తాజా పర్యటనలో ఇవాంకా ట్రంప్ ఇండయాలో అడుగు పెట్టింది మొదలు అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ ఇలా ఆమె ఎక్కడెక్కడ ఉన్నా కెమేరాల కళ్లు అన్నీ ఆమె వైపే తిరిగాయి. ఇవాంకా ఎక్కడ ఉంటే అక్కడే అన్నీ కెమేరాల ప్లాస్లు జుమ్ జుమ్ అన్నాయి.
ఆమె వయస్సు 37 సంవత్సరాలు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఎలిజబెత్ రోజ్ (8), తర్వాత జెసెఫ్ (6), థియేటర్ జేమ్స్ (3) అనే కుమారులు ఉన్నారు. సాధారణంగా ఏ మహిళ అయినా పిల్లు పుట్టాక లావు అవుతారు. అయితే ఆమె ప్రెగ్నెన్సీ సమయంలో స్పెషల్ కేర్ తీసుకోవడంతో పాటు స్పెషల్ డైట్ ఫాలో అవ్వడం వల్లే ఇంత వయస్సులోనూ ఇంత ఫిట్‌గా ఉంది.