1000 రూ..పంపు .. 5 సెక్స్ వీడియోలు పంపుతా... పంపక పోతే పోలీసులకు చెప్తా... మహిళా బీభత్సం..?

praveen

ఈ మధ్యకాలంలో సెక్స్ రాకెట్ ముఠాలు ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్న  విషయం తెలిసిందే.ఖరీదైన  భవనాలను అద్దెకు తీసుకొని... స్పాలు, మసాజ్ సెంటర్లు వంటి పేరుతో  ఎవరికీ తెలియకుండా గుట్టుగా సెక్స్ రాకెట్ నడిపిస్తున్న వారు  రోజురోజుకు ఎక్కువైపోతున్నారూ . పోలీసులు ఎంత మందిని పట్టుకొని కటకటాల వెనుకకు తోసినప్పటికీ ఎవరి లో మార్పు రావడం లేదు  ఇలాంటి సెక్స్ రాకెట్ ముఠాలు ఎక్కువై పోతున్నాయి . అయితే ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది... అయితే ఇక్కడ సెక్స్ రాకెట్ ముఠా ఏమి లేదు కానీ కొంత మంది యువకులకు బెదిరింపులు వచ్చాయి. గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని సెక్స్ వీడియోలు పంపిస్తాను అంటూ గుర్తు తెలియని మహిళ యువకులకు తెలిపింది  . ఇక  యువకులు ఈ ఆఫర్ తిరస్కరించడానికి సెల్ఫోన్లో బెదిరింపులకు తెరలేపింది. 

 

 

 దీంతో యువకులు పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుర్తు తెలియని మహిళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే... చెన్నై మధురవాయల్  కు చెందిన ఉదయరాజు ఓ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగి . అయితే అతన్ని  సెల్ ఫోన్ ద్వారా  ఓ మహిళ సంప్రదించింది. గూగుల్ పే ద్వారా ₹1000 పంపితే... అశ్లీల వీడియోలను పంపుతాను అంటూ తెలిపింది ఆ గుర్తు తెలియని మహిళ. దీనికి ఉదయరాజు మాత్రం సమ్మతించలేదు. ఈ నేపథ్యంలో బెదిరింపులకు తెరలేపింది ఆ మహిళ.. 

 

 

 ఎస్ఎంఎస్ ద్వారా ఉదయ రాజ్ ను సంప్రదించింది ఆ మహిళా . ఈ క్రమంలోనే ఆమె కు సహాయంగా ఓ వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. వేయి రూపాయలు పంపితే 5 శృంగార వీడియోలు... 1500 పంపితే 10 శృంగార వీడియోలు పంపిస్తాను అంటూ ఆమె తెలిపింది. ఆ తర్వాత ఉదయ్ రాజు అందుకు సమ్మతించకపోవడంతో ఆ యువతి ఉదయ్ రాజు పై మైలాపూర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ వద్ద ఫిర్యాదు చేసింది. ఇదే క్రమంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఉదయ్ రాజు  తనకు వచ్చిన ఎస్ఎంఎస్లను సెల్ ఫోన్లో సంభాషించిన దానిని రికార్డ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక అసలు విషయం బయటపడడంతో మహిళ పరారైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: