నా భార్యను తన భార్య అంటున్నాడు.. ఆవేదన తట్టుకోలేక చనిపోతున్నా...!
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయం వైరల్ అవుతున్నాయి. మంచీ... చెడు ఏదైనా వార్త క్షణాల్లో ప్రపంచం చుట్టేస్తున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే అవుతుంది. అంతే కాదు సెల్ఫీ లు వచ్చినప్పటి నుంచి మంచి ఎన్ని జరుగుతున్నా దారుణాలు మాత్రం చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా సెల్ఫీ మోజులు పడి తాము ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితికి జనాలు వెళ్తున్నారు. మరికొంత మంది దారుణమైన పనులు చేస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు.. అవి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. మరికొంత మంది సెల్ఫీలు వీడియోలు తీసుకొని ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.
ఇటీవల కాలంలో కొంత మంది ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకొని తాము ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో తెలుపుతూ చనిపోతున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల కొంత మంది భయభ్రాంతులు కూడా సృష్టిస్తున్నారు. ఐన వారి చేతిలో మోసపోయి.. భర్త చేతి బాదపడ్డ భార్య, కుటుంబ కలహాల వల్ల.. ప్రేమికులు, అప్పులు భరించలేక ఇలా ఎన్నో కారణాల వల్ల సెల్ఫీ వీడియోలు తీసుకొని చనిపోతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళా కార్పొరేటర్ భర్త నరేష్ తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తనను ఓ వ్యక్తి చంపుతానని బెదిరిస్తున్నాడంటూ నరేష్ సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు.
'నా భార్యను తన భార్య అంటూ ఆకాష్ అనే వ్యక్తి ప్రచారం చేసుకుంటున్నాడు’ అంటూ సెల్ఫీ వీడియోలో వాపోయాడు. నరేష్ భార్య కోమలి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 10వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఆమె గెలుపొందారు. కాగా, నరేష్ సెల్ఫీ వీడియో గురించి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.