
ఏపీ సీయంను ఫాలో అవుతున్న తమిళ సూపర్ స్టార్
తాజాగా రజనీ పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం కన్ఫార్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్లోనే పార్టీని ప్రారంభించనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు పార్టీ ప్రకటన తరువాత ప్రజలతో మమేకమయ్యేందుకు సుధీర్ఘ పాద యాత్ర చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇప్పటికే తమిళ రాజకీయా విశ్లేషకులు, ప్రముఖులతో చాలా కాలంగా చర్చలు జరుపుతున్నాడు రజనీ. ముందుగా మధురై, తిరుచ్చి జిల్లాల నుంచి కార్యక్రమాలు ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయంలో ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్ర కీలక పాత్ర పోషించిదని భావిస్తున్న రజనీ, ఆ స్ఫూర్తితోనే పాదయాత్రను డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. రజనీ లాంటి సూపర్ స్టార్ పాదయాత్ర చేస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే పాదయాత్రకు బధులుగా మహానాడు పేరుతో వరుస సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని కూడా భావిస్తున్నారట. ఈ సమావేశాలకు కూడా ప్రణాలికలు సిద్దమవుతున్నాయి.
అయితే రజనీ పొలిటికల్ ఎంట్రీపై మరో వాదన కూడా ఉంది. రజనీ సొంతగా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదని.. కేవలం ఆయన బీజేపీ మద్ధతుగా రాజకీయ అరంగేట్రం ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ తీసుకున్న పలు నిర్ణయాలకు రజనీ మద్ధతు తెలపడం వెనుక కారణం కూడా అదే అని భావిస్తున్నారు.