ప్రతిపక్షాలకు రెండు విధాలుగా  షాకిచ్చిన కేంద్రం

Vijaya
రాష్ట్రంలోని అన్నీ ప్రతిక్షాలకు ఒకేసారి కేంద్రప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది.  రాజధాని ఎక్కడ పెట్టుకోవాలన్న విషయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ ఇష్టమే అంటూ స్పష్టంగా చెప్పేసింది. రాష్ట్రప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం ఎట్టి పరిస్దితుల్లోను జోక్యం చేసుకోదంటూ లిఖిత పూర్వకంగా తేల్చి చెప్పేసింది. మూడు రాజధానుల ప్రతిపాదనపై టిడిపి ఎంపి గల్లా జయదేవ్ ప్రశ్న వేశారు లేండి.

ఎంపి వేసిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ చంద్రబాబుతో పాటు మిగిలిన ప్రతిపక్షాల ఆశలపై నీళ్ళు చల్లేశారు. రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిదే అంటూ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో రాజధాని అంశాన్ని లేవనెత్తటం ద్వారా జగన్మోహన్ రెడ్డిని జాతీయస్ధాయిలో గబ్బు పట్టించాలని చంద్రబాబు వేసిన ప్లాన్ తల్లక్రిందులైంది.

మూడు రాజధానుల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తటం ద్వారా జగన్ ప్రయత్నాలను  అడ్డుకోవాలని, జగన్ పై వ్యతరేక ప్రచారం చేయాలని చంద్రబాబు ఎంపిలకు ఆదేశాలిచ్చారు. అయితే చంద్రబాబు ఒకటనుకుంటే కేంద్రం మరొకటి తలచింది. రాజదాని విషయంలో మొదటి నుండి బిజెపి రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు మాట్లాడుతూ కేంద్రం జోక్యం ఉండదని చెబుతునే ఉన్నారు. అయినా చంద్రబాబుకు ఎక్కడో దింపుడు కళ్ళెం ఆశలు చావలేదు.

ఆ ఆశని కూడా తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి చంపేశారు. పనిలో పనిగా శాసనమండలి విషయాన్ని కేంద్రప్రభుత్వం తేల్చేసినట్లే ఉంది. శాసనమండలి ఉండాలా ? వద్దా ? అన్న విషయం కూడా పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అంశమే అంటూ స్పష్టం చేసేసింది. కాబట్టి శాసనమండలి రద్దు చేస్తు తీర్మానం చేసిన విషయం కేంద్రం జోక్యముండదని రాయ్ చెప్పేశారు. అంటే ఇటు రాజధాని అటు శాసనమండలి అంశాల్లో చంద్రబాబు ఆశలపై కేంద్రప్రభుత్వం నీళ్ళు చల్లేసినట్లే అనిపిస్తోంది.  కాబట్టి ఇకనైనా వాస్తవాలు గ్రహిస్తే మంచిదేమో చంద్రబాబుకు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: