జగన్ తుగ్లక్ పాలనపై పీకే ఆవేదన... ఆంధ్రజ్యోతి ఆర్కే వద్ద కన్నీళ్లు...?
అవును ఈ హెడ్డింగ్ చదివితే నిజమా ...? అనే ఆశ్చర్యం అందరికి కలగక మానదు. ఎందుకంటే అసలు పీకే ఏంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏంటి..? ఈ ఇద్దరికీ మధ్య అంత అన్యోన్యత ఏంటి ? అసలు ప్రశాంత్ కిషోర్అసలు తన ఆవేదనను రాధాకృష్ణకు చెప్పుకోవడం ఏంటి ? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ప్రశ్నలు అందరికి వస్తాయి. అంతే కాదు వీటికి ఎంత వెతికినా చిక్కుముడులు వీడిపోవు. కానీ రాధాకృష్ణ మాత్రం తన పత్రిక సంపాదకీయంలో జగన్ తుగ్లక్ పరిపాలనపై పీకే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని, అసలు జగన్ పరిపాలనపై తాను అసంతృప్తిగా ఉన్నానని, ఈ విధంగా జగన్ వ్యవహారం ఉంటుంది అంటే నేను జగన్ ను గెలిపించకపోయి ఉండేవాడిని అని పీకే బాదపడినట్టుగా రాధా కృష్ణ చెప్పుకుని బాధను వ్యక్తం చేశాడు.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ గెలుపుకి పీకే బాగా సహాయ సహకారాలు అందించి గెలుపులో భాగం అయినా సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత బీహార్ రాజకీయాల్లో మునిగి తేలుతూనే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల గెలుపు కోసం వ్యూహాలు రచించే పనిలో పడ్డాడు పీకే. ఇది ఇలా ఉండగానే ఇటీవలే ఆయన్ను జేడీయూ నుంచి బీహార్ సీఎం నితీష్ కుమార్ సస్పెండ్ చేసారు. పీకే ఇప్పుడు తెగ బాధపడిపోతున్నాడట. అయితే అయన బాధ పార్టీ నుంచి బహిష్కరించినందుకు కాదట. మొన్నటి ఎన్నికల్లో జగన్ కోసం పని చేసినందుకట.
వాస్తవానికి ఆ ఎన్నికల్లో చంద్రబాబే గెలవాల్సి ఉన్నా పీకే రంగంలోకి దిగిపోయి బాబుకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని మొత్తం మార్చేసి జగన్ వైపు తిప్పి ఆయన గెలుపులో భాగం అయినట్టుగా ఇప్పుడు జగన్ పాలన చూసి బావురమన్నట్టుగా రాధాకృష్ణ ఇప్పుడు బాధపడిపోతున్నాడు. పచ్చ మీడియా గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనమైన కీర్తిని పొందిన రాధాకృష్ణ ఇప్పడు ఇలా బాధపడిపోతూ ఎక్కడో ఉన్న పీకే ఇలా అనుకుంటున్నాడు అంటూ తన సొంత అభిప్రాయాన్ని బాబు కి అనుకూలంగా .. జగన్ కు వ్యతిరేకంగా పలకడపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.