జగన్ తీరుపై కెసిఆర్ గుర్రు ? ఇకపై....?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం ఇద్దరు మధ్య ఉన్న స్నేహ సంబంధం గురించి అందరికి తెలిసిందే. ఏపీ, తెలంగాణలో విభజన సమస్యలపై ఈ ఇద్దరు కూర్చుని సామరస్యపూర్వకంగా పరిష్కార మార్గాలు కూడా వెతుక్కుంటూ అందరికి అదరస్యంగా నిలుస్తున్నారు. అలాగే ఏపీలో వైసిపి గెలిచేందుకు కెసిఆర్ పరోక్షంగా తగిన సహకారం కూడా అందించారు. అలాగే ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జగన్ చూస్తూ వస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు బీజేపీ కారణంగా ఈ ఇద్దరు మిత్రుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణ సీఎం గా కేటీఆర్ ను నియమించి తాను కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్నారు.
కేసీఆర్ మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ ద్వారా జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే బిజెపి వ్యతిరేక శక్తులు అన్నిటినీ ఫెడరల్ ఫ్రంట్ లోకి తీసుకువచ్చి భవిష్యత్తులో కేంద్రంలో బలమైన శక్తిగా ఎదగాలని కెసిఆర్ ఆరాటపడుతున్నారు. అయితే ఈ విషయంలో తన మిత్రుడు జగన్ వెనుకడుగు వేస్తూ బీజేపీ అంటే భయంతో ఉన్నట్టుగా వ్యవహరిస్తుండడం కేసీఆర్ కు ఆగ్రహం కలిగిస్తున్నాయి. అలాగే కేంద్ర బడ్జెట్ లోనూ, తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగినా బిజెపిని గట్టిగానిలదీయడం లేదు అంటూ కేసీఆర్ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిజెపి నిన్న ప్రకటించిన బడ్జెట్ నిరాశపరిచింది అంటూ వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి ప్రకటిస్తే ఆ పార్టీకి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు బడ్జెట్ బాగుంది అన్నట్టుగా మాట్లాడారు. అలాగే వైసిపి మరో ఎంపీ రఘురామకృష్ణంరాజు బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది అని వ్యాఖ్యానించడం ఇవన్నీ ప్రస్తావిస్తూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ పై గట్టిగా కేంద్రాన్ని జగన్ ప్రభుత్వం నిలదీయకపోవడానికి జగన్ కు ఉన్న కారణాలు చాలానే ఉన్నాయి... ఇక ఆయన మనతో వచ్చే ఛాన్స్ లేదు అన్న అభిప్రాయానికి వచ్చిన కేసీఆర్ ఇకపై జగన్ విషయంలో ఆచి తూచి అడుగులు వేయాలని చూస్తున్నారట.