కేరళ, చెన్నైలలో కరోనా కలకలం... ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా..?

praveen

ప్రపంచ దేశాలన్నింటికీ ప్రాణ భయంతో గజగజ వణికిస్తున్న వ్యాధి కరోనా  వైరస్. చైనాలో గుర్తించబడిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు అతి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఇక  అటు చైనా లో అయితే వందల మంది ప్రాణాలను బలిగొంది ఈ కరోనా  వైరస్. వేల సంఖ్యలో చైనాలో ఈ కరోనా వైరస్ బారినపడి ప్రాణభయంతో బతుకుతున్నారు. ఇక చైనాలో గుర్తించబడిన కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతు ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ... బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినది అంటే  కరోనా  వైరస్ ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మిగతా దేశాలు కూడా తమ దేశ పరిధిలోకి కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 

 

 

 విమాన ప్రయాణాలు ద్వారా వస్తున్న ప్రయాణికులను ఎయిర్పోర్టులోనే వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం దేశంలోకి అనుమతిస్తున్నారు అధికారులు. ఇక కొన్ని కొన్ని దేశాలు అయితే తమ దేశం నుంచి చైనాకు వెళ్లే విమాన సర్వీసులను కూడా పాక్షికంగా రద్దు చేశాయి. ఇక ఆయా దేశాలు కరోనా  వైరస్  అనుమానితుల సంఖ్య సంఖ్య కూడా రోజురోజుకు పెరిగి పోతుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. దీంతో కరోనా  వైరస్ దేశంలో వ్యాపించకుండా ఉండేందుకు అనుమానితుల కోసం ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. ఇక ఇప్పటికే కేరళలో ఒక కరోనా వైరస్  కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

 

 

 ఇక తాజాగా కేరళలో రెండో  కరోనా  పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ప్రజలందరికీ ప్రాణభయం పట్టుకుంది. ఐసొలేషన్  వార్డుల్లో వైద్యులు ఆ కరోనా  వైరస్ సోకిన వ్యక్తికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కాగా  కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వ్యక్తి చైనా నుంచి కేరళ కి వచ్చినట్లు గుర్తించారు అధికారులు. మరోవైపు చెన్నై ఎయిర్ పోర్టులో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. వల్లూజిన్  అనే ప్రయాణికుడికి కరోనా  వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మలేషియా నుంచి చెన్నైకు వల్లూజిన్  అనే ప్రయాణికుడు వచ్చాడు. కాగా ఈ ప్రయాణికుడికి కరోనా వైరస్ ఉంది అని నిర్ధారణ కావడంతో విమానాశ్రయంలోని ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: