నరసింహన్ వచ్చి వెల్లెన్ : గంటలోపే ముగిసిన గవర్నర్ పర్యటన

           వందల సంఖ్యలో పోలీసులు, మంత్రులు,ఎమ్మేల్యేలు,అధికారులు వారి పనంతా వదిలి రెండుమూడు రోజులుగా చేసిన ఏర్పాట్లు, తెలంగాణవాదుల హంగామా, ముందస్తు అరెస్టులు, ప్రత్యేక హెలికాప్టర్, మరెన్నో ప్రభుత్వవాహనాలు ఇలా ఎంత లేదన్నా ఖర్చు తడిసి మోపెడయింది. అయితే ఏమయింది ... అంటే నరసింహన్ వచ్చి వెల్లెన్ తప్ప.             ప్రజలకు ఏమి ఒనగూరిందో తెలియదు కాని కనీసం ఆయనేమైనా ప్రజలకష్టాలు తెలుసుకున్నారా అంటే అదీ లేదు. ఆయన పాల్గొనేందుకు ఓస్త్రీ సంఘ సమావేశం,మరో రైతు సదస్సు, జిల్లాకేంద్రంలో ఇంకో కార్యక్రమం. ఇన్ని ఏర్పాటు చేస్తే ఆయన ఈమూడింటిలో మొదటి దానిలో 15 నిముషాలు,రెండో కార్యక్రమంలో రెండు నిముషాలు,మూడో దానిలో ముప్పది నిముషాలు గడిపారు. ఆయన మాట్లాడారే తప్ప వచ్చిన వారిని పలకరించి కనీసం కష్టాల గూర్చి అడగలేదు.            మైకు తీసుకున్నారు, పేదరికంలేని రాష్ట్రాన్ని చూడడమే తన ఆకాంక్ష అన్నారు. స్త్రీ శక్తి సంఘాన్ని పొడిగారు, వీరు మిగిలిన జిల్లాల వారికి ఆదర్శం కావాలన్నారు. వైద్య,విద్యా రంగాలను అభివృద్ది చేయాలన్నారు. సొంతంగా సంపాదించుకొని పేదరికం దూరం చేసుకోవాలని ఓ సలహా పడేసారు. ఎంపి పొన్నం,ఎమ్మెల్యే కమలాకర్ లు తెలంగాణకు సహకరించాలని కోరినా ఆయన పల్లెత్తు సమాధానం ఇవ్వలేదు. పైగా అదృష్టం బాగుండి మల్లీ వచ్చే అవకాశం వస్తే మాత్రం ఇక్కడి పాల ఉత్పత్తి,పాలపదార్థాల తయారీని ఒక రోజంతా ఉండి చూస్తానన్నారు. ఇది అవసరం అంటారా. ప్రజలకేమి చేయకుండా,ఆయన కూడా ఏమి తెలుసుకోకుండా ఇంత ప్రజాధనాన్ని వెచ్చించి ఆయన టూర్ చేయడం అవసరం అంటారా అని సామాన్యుడు సనుగుతున్నాడు. తప్పంటారా... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: