ఆ విషయంలో జగన్ కంటే చంద్రబాబు బెటర్... నాగబాబు సంచలన వ్యాఖ్యలు... ?

Reddy P Rajasekhar

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, ప్రముఖ నటుడు నాగబాబు చంద్రబాబును తెగ పొగిడేస్తూ అదే సమయంలో జగన్ పై విమర్శలు చేశారు. ఒక విషయంలో చంద్రబాబు నాయుడు జగన్ కంటే బెటర్ అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడేనికి వచ్చిన నాగబాబు ఇక్కడి స్థానిక మీడియాతో కాసేపు ముచ్చటించారు. 
 
నాగబాబు మాట్లాడుతూ జనసేన - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షించారు. బీజేపీ - జనసేన ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుందని నాగబాబు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కావడం లేదని నాగబాబు అన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏ పని మొదలుపెట్టినా ముందుగానే తెలిసే విధంగా చేసేవారని నాగబాబు అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం జగన్ ఏం చేస్తున్నారో ఎవరికీ అంతు చిక్కటం లేదని నాగబాబు చెప్పారు. ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలను అమలు చేసేముందు అనుభవజ్ఞులతో చర్చించాలని ఆ తరువాత తగిన నిర్ణయం తీసుకోవాలని నాగబాబు సూచనలు చేశారు. 
 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జగన్ తో పోలిస్తే కొంత బెటర్ అని నాగబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయంటూ నాగబాబు వైసీపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో జగన్ ఏది ఎప్పుడు రద్దు చేస్తామని చెబుతారో తెలియని పరిస్థితి నెలకొందని నాగబాబు అన్నారు. 2024లో బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని నాగబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదని హెలికాఫ్టర్లు కొనుక్కొని ప్రయాణించాలని నాగబాబు అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: