ఆ సీరియల్ చూసి బాలికను కిడ్నాప్ చేశాడు... కానీ..?

praveen

ఈమధ్య సినిమాలు సీరియల్స్ ప్రభావం ప్రజలపై భారీగానే ఉంటుంది. ఇక సినిమాలు సీరియల్ లను చూసి మంచి చేసే వారి కంటే సీరియల్ లో జరిగిన చెడును ఎక్కువగా స్వీకరిస్తున్నారు. ఇక సినిమాలు సీరియల్ లో చేసినట్లుగానే తాము కూడా చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి కూడా. ముఖ్యంగా సీరియల్ అయితే ఎక్కువగా జనాల పై ప్రభావం చూపుతున్నాయి. సీరియల్లో చేసినట్లుగానే హత్యలు చేయడం... సీరియల్ చూసి ఇన్స్పైర్ అయి కిడ్నాప్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక్కడ ఓ యువకుడు ఇలాంటిదే చేశాడు. హిందీ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే క్రైమ్  సీరియల్ చూసి యువకుడు ఓ బాలికను కిడ్నాప్ చేశాడు. 

 కాగా సీరియల్ చూసి బాలికను కిడ్నాప్ చేసిన నిందితున్ని పోలీసులు గంట వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ ఘటన బెంగళూరు కాటన్ పేటే  పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బసవనగుడి బుల్ టెంపుల్ రోడ్డున ఉండే 21 ఏళ్ల  చిరాగ్  మెహతా అనే యువకుడు కిడ్నాప్ కి పాల్పడ్డాడు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కేథరిన్  స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న నాలుగో తరగతి బాలికను ఆ యువకుడు అపహరించి స్కూటర్ పై  ఉడాయించాడు . ఇక తమ కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక వెంటనే అప్రమత్తమైన సిఐ టిసి వెంకటేష్ లా వెళ్లి రోడ్డు వద్ద వెళ్తున్న చిరాగ్  మెహతాను పట్టుకొని బాలికను కాపాడారు. 

 అయితే బాలిక తండ్రి హీరాలాల్  కాటన్ పేటే  మెయిన్ రోడ్లో నివాసముండే ఓ ఎలక్ట్రిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. కాగా ఆ బాలికను కిడ్నాప్ చేసి తండ్రి వద్ద భారీగా డబ్బులు గుంజాలని ఈ పథకం వేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా నిందితుడు చిరాక్ మెహతా తండ్రి రాకేష్ పెళ్లి పత్రికలు దుకాణం నిర్వహిస్తూ ఉండేవాడు. కాగా  ఓ టీవీ సీరియల్ చూసి బాలికను కిడ్నాప్ చేయాలనుకున్నానని నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: