
79 ఏళ్ల బామ్మ... ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించింది..?
మామూలుగా గ్రామాల్లో ఉండే వృద్దులు ఏం చేస్తుంటారు. కృష్ణ రామ అనుకుంటూ కాలం వెళ్లదీస్తు జీవనం సాగిస్తూ ఉంటారు. చాలామంది వేరే వారి సాయంతో బ్రతుకున వెళ్లదీస్తుంటారు. కానీ ఇక్కడ ఒక బామ్మ మాత్రం అందరిలా కృష్ణా రామా అంటూ ఇంటిపట్టున కూర్చోలేదు. ఎవరితో వయసులో ఇంకేం చేస్తాం లే అంటూ వెనకడుగు వేయలేదు. ఆమెకు 79 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇంకా ప్రజలకు ఏదో సేవ చేయాలని భావించింది.ఈ వయసులో కూడా ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని సంకల్పంతో ముందుకు సాగింది. అనుకున్నదే తడవుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసింది. చివరికి అసలేం జరిగింది తెలుసుకోవాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. కృష్ణా రామా అంటే అంటూ ఇంట్లో కూర్చోకుండా ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసింది.
కృష్ణ రామ అనుకునే వయస్సులో కూడా ప్రజలకు సేవ చేయాలని భావించింది. ప్రజలకు సేవ చేయాలనుకుంటే వయసుతో సంబంధం ఏంటి అని నిరూపించింది. దృఢ సంకల్పంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసింది. ఎంతో మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం వృద్ధురాలిపై నమ్మకం ఉంచారు. మంచి జరుగుతుందని భావిస్తూ ఆ ఊరు యువత మొత్తం వృద్ధురాలికి ఓటు వేసి గెలిపించారు. తమిళనాడులోని మేలూరు తాలూకాలోని అరిట్ఠపట్టికి జరిగిన స్థానిక ఎన్నికల్లో 79 ఏళ్ళ విరమ్మాళ్ అళగప్పన్ అనే బామ్మ గెలిచి సంచలనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో బామ్మకు ఏకంగా ఏడుగురు ప్రత్యర్థులు ఉండడం గమనార్హం.
ఎన్నికల్లో ఈ భామకు ప్రత్యర్థిగా ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచినప్పటికి కూడా గ్రామ ప్రజలందరూ ఈ భామ పైన నమ్మకం ఉంచారు. ఈ భామ గ్రామాభివృద్ధి చేయగలరని నమ్మరు. గ్రామంలోని యువత కూడా 79 ఏళ్ల బామ్మ వైపు నిలవడంతో ప్రత్యర్దులందరినీ ఓడించి విజయం సాధించింది ఈ 79 ఏళ్ల బామ్మ. ఏకంగా 190 ఓట్ల తేడాతో గెలిచి సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ను ఈ బామ్మకు అందించారు అధికారులు. ఈ గ్రామంలోని యువతే నన్ను గెలిపించారని... వయసుతో సంబంధం లేకుండా ప్రజల కోసం గ్రామాభివృద్ధికి పనిచేస్తానని ఈ భామ్మ దొరికింది. ఎన్నికల్లో ఈ భామ గెలవడంతో ఈ భామకు ఓటేసిన యువత అందరూ ఆనందంలో మునిగిపోయారు.